Asianet News TeluguAsianet News Telugu

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి కేంద్ర బృందం.. మహిళల మృతి ఘటనపై ఆరా..

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతిచెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని కేంద్ర వైద్య బృందం పరిశీలించింది.

central team visit ibrahimpatnam government hospital
Author
First Published Sep 3, 2022, 11:50 AM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతిచెందడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని కేంద్ర వైద్య బృందం పరిశీలించింది. ఆస్పత్రిని పరిశీలించిన కేంద్ర బృందం.. జిల్లా వైద్య బృందం, డాక్టర్లను ప్రశ్నించింది. 

ఇదిలా ఉంటే.. ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో తెలంగాణ డీహెచ్ శ్రీనివాస్ రావు నేతృత్వంలోని శుక్రవారం పర్యటించింది. ఇటీవల ఇబ్రహీపట్నం సీహెచ్‌సీలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న నలుగురు మహిళలు మృతిచెందడం తీవ్రకలకం రేపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై డీహెచ్‌‌ను విచారణాధికారిగా నియమించింది. వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ క్రమంలోనే డీహెచ్ శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం ఇబ్రహీంపట్నం ఆస్పత్రిని సందర్శించింది. ఆస్పత్రిలో ఆపరేషన్ చేసిన గది, పరికరాలను ఈ బృందం పరిశీలించింది. 

ఇక,  ఈ ఘటనకు సంబంధించి రిటైర్డ్ సర్జన్ డాక్టర్ సునీల్ జోయల్ విచారణకు గైర్హాజరయ్యారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్‌లలో జోయల్ కీలకంగా వ్యవహరించడంతో అధికారులు ఆయనను శుక్రవారం విచారణకు పిలిచారు. అయితే ఇబ్రహీంపట్నం ఆసుపత్రితో పాటు కోఠిలోని డీహెచ్ ఆఫీస్‌లో జరిగిన విచారణలకు జోయల్ హాజరుకాలేదు. కేవలం క్యాంప్‌లో పాల్గొన్న సిబ్బందిని విచారించిన డీహెచ్ శ్రీనివాసరావు ఆడియో, వీడియో స్టేట్మెంట్ రికార్డు చేశారు. అయితే జోయల్ మాత్రం ఎంతకీ రాకపోవడంతో కమిటీ సభ్యులు వెళ్లిపోయారు. 

Follow Us:
Download App:
  • android
  • ios