హైదరాబాద్: రాష్ట్రంలో వరదలతో జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకుగాను తెలంగాణకు కేంద్ర బృందం గురువారం నాడు హైద్రాబాద్ కు వచ్చింది.

ఈ నెల 13వ తేదీన నగరంలో భారీ వర్షం వచ్చింది. ఈ నెల 17వ  తేదీన కూడ భారీ వర్షం వచ్చింది. దీంతో నగరంలోని పలు కాలనీలు  ఇంకా  వరద నీటిలోనే ఉన్నాయి.

ప్రాథమిక అంచనా మేరకు రాష్ట్రంలో రూ. 5 వేల కోట్ల నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. తక్షణ సహాయంగా రూ.1350 కోట్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశాడు. 

also read:హైద్రాబాద్‌‌లో భారీ వర్షాలు, కూలిన గోల్కోండ గోడ: పురాతన కట్టడాలకు దెబ్బేనా?

రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఇవాళ హైద్రాబాద్ కు వచ్చింది. సచివాలయంలో  రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కేంద్ర బృందం సమావేశమైంది.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన నష్టం గురించి కేంద్ర బృందానికి సీఎస్ పూర్తి వివరాలు అందించాడు. రెండు రోజుల పాటు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనుంది.