Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో టీఆర్ఎస్‌దే మళ్లీ అధికారం...కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడం ఖాయమని తెలంగాణ బిజెపి నాయకులు ప్రకటిస్తున్న వేళ ఓ కేంద్ర మంత్రి వారికి షాకిచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదీ తెలంగాణ పర్యటనలో బాగంగానే ఆ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ బిజెపి నాయకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.
 
central minister ramdas athawale controversy statement
Author
Kamareddy, First Published Sep 4, 2018, 8:51 PM IST

తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఓడించడం ఖాయమని తెలంగాణ బిజెపి నాయకులు ప్రకటిస్తున్న వేళ ఓ కేంద్ర మంత్రి వారికి షాకిచ్చారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీనే మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదీ తెలంగాణ పర్యటనలో బాగంగానే ఆ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ బిజెపి నాయకులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని సంసిద్దం చేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు కూడా అందుకోసం సిద్దమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని సాయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు అనుమతులు తెచ్చుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. అందువల్లే కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్, బిజెపిలు కుమ్మకయ్యాయని ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తున్న తెలంగాణ బిజెపి టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే తమ లక్ష్యమంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ సమయంలో కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన టీఆర్ఎస్ పార్టీ గెలుపుపై జోస్యం చెప్పారు. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కేసీఆరే మళ్లీ సీఎం అవుతాడంటూ వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడిన మాటలు తెలంగాణ బిజెపిలో ప్రకంపనలు సృష్టించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios