నిజామాబాద్‌లో పీఎఫ్ఐకి చెందిన నలుగురు అరెస్ట్: కేంద్ర నిఘా వర్గాల ఆరా
నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్‌ఐకి చెందిన నలుగురు అరెస్ట్ కావడంతో నిఘా వర్గాలు అలర్టయ్యాయి. కేంద్ర నిఘా వర్గాలు కూడా ఈ విషయమై ఆరా తీశాయి. నిషేధిత సంస్థలతో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే తమ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారని అరెస్టైన వారి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
నిజామాబాద్: ఉమ్మడి NIzambad జిల్లాలో PFI కార్యక్రమాలు సాగుతున్న విషయం వెలుగు చూడడంతో కేంద్ర, రాష్ట్ర నిఘా వర్గాలు అలర్టయ్యాయి. ఈ విషయమై కేంద్ర నిఘా వర్గాలు కూడా సమాచారాన్ని సేకరిస్తున్నాయి.,
SIMI పై నిషేధం విధించడంతో పీఎఫ్ఐ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని నిజామాబాద్ సీపీ నాగరాజు చెప్పారు. పీఎఫ్ఐ పేరుతో సుమారు 200 మంది శిక్షణ పొందినట్టుగా Police గుర్తించారు. నిజామాబాద్ జిల్లాతో పాటు జగిత్యాల, కడప, నెల్లూరు, కర్నూల్, హైద్రాబాద్ ప్రాంతాలకు చెందిన వారు శిక్షణ పొందారని నిజామాబాద్ పోలీసులు గుర్తించారు.
పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్, షేక్ సాదుల్లా,మహమ్మద్ ఇమ్రాన్, మహ్మద్ అబ్దుల్ మోబిన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. పీఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో కేంద్ర నిఘా వర్గాలు అలర్టయ్యాయి. ఈ సంస్థ యువకులు ఏ రకమైన శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ ఉద్దేశ్యం ఏమిటనే విషయాలపై పోలీసలు దర్యాప్తు చేస్తున్నారు.ఈ విషయమై కేంద్ర నిఘా సంస్థలు కూడా సమాచారాన్ని సేకరిస్తున్నాయి..
అయితే పీఎఫ్ఐ ట్రైనర్ Khadaar తన ఇంట్లో శిక్షణ గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు కూడా నిఘాను ఏర్పాటు చేశారు. ఈ నిఘా ఆధారంగా పీఎఫ్ఐ Trainer ఖాదర్ ను పోలీసులు ఈ నెల 6న అరెస్ట్ చేశారు. పీఎప్ఐపై ఇతర రాష్ట్రాల్లో నిషేధం ఉన్న విషయాన్ని కూడా నిజామాబాద్ పోలీసులు గుర్తు చేస్తున్నారు.
మత కల్లోలాలు సృష్టించడమే లక్ష్యంగా పీఎఫ్ఐ పనిచేస్తుందని పోలీసులు చెబుతున్నారు. మత ఘర్షణలు జరిగిన సమయంలో ఈ ఘర్షణలు మరింత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తారని నిజామాబాద్ సీపీ Nagaraju మీడియాకు చెప్పారు. ఖాదర్ వద్ద శిక్షణ పొందిన వారెవరు ఎక్కడెక్కడ ఉన్నారనే విషయమై ఆరా తీస్తున్నామన్నారు. కరాటే శిక్షణ పేరుతో పీఎఫ్ఐ తన కార్యక్రమాలను కొనసాగిస్తుందని Nizambad CP నాగరాజు చెప్పారు.
ఈ విషయమై తాము కచ్చితమైన ఆధారాలను సేకరించినట్టుగా ఆయన గుర్తు చేశారు. ఖాదర్ ఇతర జిల్లాలకు వెళ్లినట్టుగా తాము గుర్తించామన్నారు.ఈ విషయమై తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. అరెస్ట్ చేసిన నలుగురిపై నాన్ బెయిలబబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. అదే సమయంలో ఉపా చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్పారు.
also read:నిజామాబాద్ లో ఉగ్రలింకుల కలకలం: పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ అరెస్ట్
గతంలో కూడా నిజామాబాద్ జిల్లాలో Terrorists తో లింకులున్నవారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం అరెస్టైన వారికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు వీరికి ఏయే సంస్థలతో సంబంధాలున్నాయనే విషయాలపై కూడా స్థానిక పోలీసులతో పాటు కేంద్ర నిఘా వర్గాలు కూడా ఆరా తీస్తున్నాయని స్థానిక మీడియా రిపోర్టు చేసింది.