అధికారులతో ఈసీ బృందం సమావేశం...ఈ విషయాలపైనే చర్చ

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 12, Sep 2018, 6:34 PM IST
central election commission members meeting with telangana officers
Highlights

తెలంగాణ అసెంబ్లీ రద్దవడంతో త్వరలో ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ బృందం ఇవాళ ఉన్నతాధికారులతో సమావేశమైంది. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సీఎస్, డిజిపి, ఫైనాన్స్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పాల్గొన్నారు.  

ఈ సమావేశంలో తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన పలు కీలక అంశాల గురించి చర్చించినట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల సన్నద్దతపై అంచనా వేసినట్లు ఈసీ తెలిపింది. ఎన్నికల కోసం అధికారులు ఏమేరకు సిద్దంగా ఉన్నారో తెలుసుకున్నట్లు ఈసీ తెలిపింది. అలాగే ఎన్నికల కోసం ఉపయోగించే సిబ్బంది తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. ముఖ్యంగా భద్రతా అంశాలపై చర్చ జరిగినట్లు ఈసీ తెలిపింది.

ఇదివరకు వివిధ పార్టీల సభ్యులతో జరిగిన సమావేశంలో వారు చెప్పిన సమస్యలన్నీ నోట్ చేసుకున్నట్లు ఈసీ తెలిపింది. రాజకీయ పార్టీలు ప్రస్తావించిన సమస్యలపై డీఎల్ఓలు స్పందిస్తారని పేర్కొన్నారు. అలాగే జిల్లా ఎన్నికల అధికారులు ప్రతి సమస్యను 24 గంటల్లో స్పందించాలని ఈసీ సూచించింది.

ఇక ఓటర్ల నమోదు కార్యక్రమాలకు మంచి ప్రచారం కల్పించాలని ఈసీ అధికారులను సూచించింది. ఎస్సెమ్మెస్ ల ద్వారా ఓటరు నమోదు పై ప్రచారం చేయాలని సూచించింది. ఈ పర్యటనకు సంబంధించిన నివేదికను కేంద్ర ఎన్నికల ప్రధానాదికారికి అందించనున్నట్లు బృంద సభ్యులు తెలిపారు. 
 
loader