రాష్ట్రంలో కేంద్రబృందం పర్యటన తర్వాతే..: కేంద్ర క్యాబినెట్ కార్యదర్శితో సీఎస్

దేశంలోని వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులతో శనివారం కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి కోవిడ్ -19 నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
 

central cabinet secretary video conference with states cs

హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర బృందం సందర్శన అనంతరం పరీక్షా సదుపాయాలను పెంచడంతో పాటు కంటైన్ మెంట్ జోన్లలో కరోనా నియంత్రణ కు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాకు వివరించారు. 

వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శులతో శనివారం కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి కోవిడ్ -19 నియంత్రణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. 

read more  వేములవాడ ఆలయంలో కరోనా కలకలం... వేద పారాయణదారునికి పాజిటివ్

కంటైన్ మెంట్ జోన్లలో లాక్ డౌన్ కు సంబంధించి కఠినంగా చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా సామర్థ్యాలను పెంచడం , ట్రేసింగ్ , టెస్టింగ్ , ఇతర చర్యల కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సూచించారు. ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలో అన్నదానిపై సీఎస్ లతో చర్చించినట్లు క్యాబినెట్ కార్యదర్శి వెల్లడించారు. 

మరణాల సంఖ్య సాధ్యమైనంత తగ్గించడంపై దృష్టి పెట్టాలని వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కు ఆయన తెలిపారు. వ్యక్తి గత రక్షణ పరికరాలు, N-95 మాస్క్ ల లభ్యత, క్లినికల్ మేనేజ్ మెంట్, ఇతర మౌళిక సదుపాయాల సమస్యలపై ప్రధాన కార్యదర్శులు వ్యక్తిగతంగా సమీక్షించాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్సులో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ తో పాటు డిజిపి. మహేందర్ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యకార్యదర్శులు రవి గుప్త, వికాస్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios