Asianet News Telugu

వేములవాడ ఆలయంలో కరోనా కలకలం... వేద పారాయణదారునికి పాజిటివ్

తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. కొద్దిరోజులకు కేవలం హైదరాబాద్ కే పరిమతమైన ఈ వైరస్ తాజాగా జిల్లాలకై వేగంగా పాకుతోంది.   

vemulawada temple employee infected with corona
Author
Vemulawada, First Published Jul 4, 2020, 7:34 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు మరింత విజృంభిస్తోంది. కొద్దిరోజులకు కేవలం హైదరాబాద్ కే పరిమతమైన ఈ వైరస్ తాజాగా జిల్లాలకై వేగంగా పాకుతోంది. ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. 

కేవలం శనివారం ఒక్కరోజే సిరిసిల్ల జిల్లాలో ఏడు కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. జిల్లాలోని ప్రముఖ దేవాలయమైప వేములవాడ రాజన్న సన్నిధిలో వేద పారాయణం చేసే వ్యక్తికి కరోనా సోకింది. దీంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యారు. మిగతా ఆలయ సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. అలాగే సిబ్బంది నుండి భక్తులకు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  

ఇక సిరిసిల్ల పట్టణంలో నెహ్రూ నగర్ కు చెందిన ఒకరికి, పోత్గల్ గ్రామానికి చెందిన ముగ్గురికీ, తంగల్లపల్లి చెందిన ఒకరికి, నేరెళ్ల కు చెందిన ఒకరికి కరోనా నిర్దారణ అయ్యింది. మొత్తంగా జిల్లావ్యాప్తంగా ఏడుగురికి నేడు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఈ కేసులతో కలుపుకుని ఇప్పటి వరకు రాజన్నసిరిసిల్ల జిల్లాలో 51 కరోనా కేసులు నమోదయ్యాయి. 

read more  కేంద్రం దృష్టికి... డేంజర్ జోన్లో హైదరాబాద్: కేసీఆర్ కు కిషన్ రెడ్డి షాక్

మొత్తంగా తెలంగాణలో కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే రాష్ట్రంలో 1,892 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,462కి చేరింది. 

ఒక్క హైదరాబాద్‌లోనే శుక్రవారం 1,658 మందికి పాజిటివ్‌గా తేలడంతో అధికార వర్గాలు ఉలిక్కిపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా 8 మంది వైరస్ కారణంగా మరణించారు. వీటితో కలిపి తెలంగాణలో కోవిడ్ మృతుల సంఖ్య 283కి చేరుకుంది. తెలంగాణలో నిన్న 1,126 మంది డిశ్చార్జ్ అవ్వగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 10,195కు చేరింది.

హైదరాబాద్ తర్వాత రంగారెడ్డి 56, మేడ్చల్ 44, సంగారెడ్డి 20, మహబూబ్‌‌నగర్‌లలో 12, సిరిసిల్ల 6, కామారెడ్డి 6, నల్గొండ 13, వరంగల్ (రూరల్) 41, వనపర్లి 5, కొత్తగూడెం 4, మహబూబాబాద్ 7, మెదక్ 3, నిజామాబాద్ 3, వికారాబాద్, నాగర్‌కర్నూలు, వరంగల్ అర్బన్, జగిత్యాల, ములుగులలో ఒక్కొక్క పాజిటివ్ కేసు నమోదయ్యాయి. 

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అధికారిక నివాసం ప్రగతిభవన్ లో పనిచేసే ఐదుగురికి కరోనావైరస్ సోకింది. దాంతో ప్రభుత్వ వర్గాల్లో కలకలం చోటు చేసుకుంది. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. 

ఐదుగురు ఉద్యోగులు తిరిగిన ప్రాంతాల్లో అధికారులు శానిటైజ్ చేస్తున్నారు. గత ఐదు రోజులుగా ముఖ్యమంత్రి కెసీఆర్ గజ్వెల్ లోని తన నివాసగృగహంలో ఉంటున్నారు. అయితే ప్రగతి భవన్ ఉద్యోగులకు కరోనా సోకిన విషయంపై ప్రభుత్వం ఏ విధమైన అధికారిక ప్రకటన కూడా చేయలేదు. ఈ విషయంపై మీడియాలో వార్తలు వస్తున్నాయి.

గత వారం రోజుల్లో దాదాపు గా 20 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. పలువురు అవుట్ సోర్సింగ్, సెక్యూరిటీ సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. దీంతో వైద్యాధికారుల పర్యవేక్షణ లో ప్రగతి భవన్‌ ను శానిటైజేషన్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios