హైదరాబాద్: ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డిపై హైద్రాబాద్‌లో  మంగళవారం నాడు కేసు నమోదైంది. భావన అనే యువతి మహేష్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భావన ఫిర్యాదు మేరకు మహేష్ రెడ్డిపై జవహార్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Also Read:హైదరాబాద్‌ ఐఐటీలో విషాదం: విద్యార్ధి ఆత్మహత్య

కడప జిల్లాకు చెందిన మహేష్ రెడ్డితో తన వివాహం గత ఏడాది జరిగిందని భావన అనే యువతి చెప్పారు. గత ఏడాది కీసర రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తామిద్దరం రిజిస్టర్ మ్యారేజీ చేసుకొన్నట్టుగా ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పారు.

భావన దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. మహేష్ రెడ్డి ఐపీఎస్‌గా సెలెక్ట్ అయిన తర్వాత అతనిలో మార్పు వచ్చిందని భావన పోలీసులకు ఇచ్చిన పిర్యాదులో తెలిపారు.

ఐపీఎస్‌గా ఎంపికైన తర్వాత మహేష్ రెడ్డి కట్నం కోసం తనను వేధింపులకు గురిచేస్తున్నారని భావన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రైనింగ్ కు వెళ్లిన తర్వాత తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని  భావన పోలీసులకు చెప్పారు. మహేష్ రెడ్డి కుటుంబసభ్యుల నుండి తనకు ప్రాణ హాని ఉందని  భావన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కడప జిల్లాకు చెందిన మహేష్ రెడ్డి  ఉస్మానియా యూనివర్శిటీలో చదువుకొనే రోజుల్లో భావనతో పరిచయం ఏర్పడింది. 9 ఏళ్లుగా తాము ప్రేమించుకొన్నామని భావన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

తొమ్మిదేళ్ల తర్వాత గత ఏడాది తామిద్దరం కీసర రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిష్టర్ మ్యారేజీ చేసుకొన్నట్టుగా చెప్పారు. పద్మావతినగర్‌లో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని కాపురం చేస్తున్నామని ఆమె చెప్పారు. ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డిపై జవహార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నారు. 

మహేష్ రెడ్డి ఐపీఎస్ కు సెలెక్ట్ అయ్యాక చాలా మార్పు వచ్చిందని భావన ఆరోపిస్తున్నారు. ఐపీఎస్ ట్రైనింగ్ కు వెళ్లాక మహేష్ రెడ్డిలో పూర్తి మార్పు వచ్చిందని భావన పోలీసులకు ఫిర్యాదు చేశారు. 45 రోజులుగా మహేష్ రెడ్డి కోసం  తాను విసిగి వేశారినట్టుగా  భావన ఆరోపించారు. ఇక తప్పని పరిస్థితుల్లోనే తాను జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టుగా ఆమె తెలిపారు.