వివాహేతర సంబంధం : సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మర్మాంగాలు కోసిన కానిస్టేబుల్...
పోలీసు శాఖలో అక్రమసంబంధం దారుణ ఘటనకు దారి తీసింది. ఓ పోలీసుకు కానిస్టేబుల్ కు మధ్య వివాహేతరసంబంధం ఉంది.
మహబూబ్ నగర్ : మహబూబ్నగర్ సిసిఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పై కానిస్టేబుల్స్ కత్తితో దాడి చేశారు. అక్రమ సంబంధం నేపథ్యంలో ఈ దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ పై కానిస్టేబుల్స్ జగదీష్, శకుంతల కత్తితో దాడి చేసి పరారయ్యారు. సీఐ ఇప్తీకార్ పరిస్థితి విషమంగా ఉంది. ఇప్తీకార్ అదే స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శకుంతలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసిన ఆమె భర్త సీఐపై దాడికి దిగాడు.
కత్తితో అతని మర్మాంగాలను కోశాడు. దీనికి శకుంతల కూడా సహకరించింది. ఇది గమనించిన వారు వెంటనే హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. కానీ ఇన్ స్పెక్టర్ పరిస్తితి విషమంగానే ఉన్నట్టు తేలింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.