Asianet News TeluguAsianet News Telugu

ఏలూరులో వింత వ్యాధి : వెలుగులోకి షాకింగ్ విషయాలు.. !

వింత వ్యాధితో వణికిపోతున్న ఏలూరుకు ఎయిమ్స్, డబ్లూహెచ్ వో టీం రానున్నాయి. ఇప్పటికే ఏలూరు అంతుచిక్కని వ్యాధికి సంబంధించి ఎయిమ్స్‌  ఓ అంచనాకు వస్తోంది. పాలకల్తీ వల్లకానీ, పురుగు మందుల వల్ల కానీ ఈ వ్యాధి ప్రబలిందని అనుమానిస్తున్నారు.  నలుగురు బాధితుల నుంచి సేకరించిన బ్లడ్, యూరిన్ శాంపిల్స్‌ను ఎయిమ్స్ నిపుణులు పరీక్షిస్తున్నారు. 

CCMB AIIMS roped in to unravel Eluru's mystery illness - bsb
Author
Hyderabad, First Published Dec 8, 2020, 11:10 AM IST

వింత వ్యాధితో వణికిపోతున్న ఏలూరుకు ఎయిమ్స్, డబ్లూహెచ్ వో టీం రానున్నాయి. ఇప్పటికే ఏలూరు అంతుచిక్కని వ్యాధికి సంబంధించి ఎయిమ్స్‌  ఓ అంచనాకు వస్తోంది. పాలకల్తీ వల్లకానీ, పురుగు మందుల వల్ల కానీ ఈ వ్యాధి ప్రబలిందని అనుమానిస్తున్నారు.  నలుగురు బాధితుల నుంచి సేకరించిన బ్లడ్, యూరిన్ శాంపిల్స్‌ను ఎయిమ్స్ నిపుణులు పరీక్షిస్తున్నారు. 

బాధితులకు సంబంధించి కొన్ని శాంపిల్స్‌ను ఢిల్లీకి పంపగా, ఇంకొన్ని శాంపిల్స్‌ను మంగళగిరి ఎయిమ్స్‌లో పరీక్షిస్తున్నారు. మోతాదుకు మించి లెడ్‌, నికెల్‌ అవశేషాలు ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది. మరో వైపు  ఇవాళ మరో 11 మంది బాధితులు ఆస్పత్రిలో చేరారు. 161 మందికి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. బెడ్లు చాలక పోవడంతో మరికొందరిని విజయవాడ, గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

పరిస్థితి తీవ్రంగా మారడంతో .. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న డబ్ల్యుహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ భవాని... వింత వ్యాధి వ్యాప్తిపై మంత్రి ఆళ్ల నాని, ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. కేసుల వివరాలు, పేషేంట్స్ లక్షణాలు, రిపోర్ట్స్ ఫలితాలపై సమీక్షలో చర్చించారు. 
పాలు, నీళ్ల పరీక్షల్లో సాధారణ ఫలితాలు రావడంతో కూరగాయలపై దృష్టిపెట్టాలని... వాటిని పురుగుమందు పరీక్షలకు పంపాలని ఆదేశించారు.  ఏలూరు ఆసుపత్రిలో న్యూరాలజిస్ట్‌ను ఏర్పాటు చేయాలని, పట్టణంలో ఫాగింగ్ చేయాలన్నారు.  

వ్యాధి లక్షణాలతో వచ్చి చేరుతున్న వారిసంఖ్య గంటగంటకు పెరుగుతుండడంతో... ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో బెడ్లు నిండిపోయాయి. దీంతో ఆశ్రమహాస్పిటల్‌లో వంద బెడ్లు ఏర్పాటు చేసి, చికిత్స అందిస్తున్నారు.  ఇప్పటికే ఇక్కడి నుంచి శాంపిల్స్.. పుణె , ఢిల్లీ ల్యాబ్‌లకు పంపారు. మరోవైపు అసలు ఇక్కడ ఏం జరిగింది? అన్న విషయాన్ని తేల్చేందుకు నేషనల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ న్యూట్రీషియన్ , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆప్ కెమికల్ టెక్నాలజీ సంస్థల నుంచిఇద్దరు శాస్త్రవేత్తలు ఇక్కడికి వచ్చారు.వైద్య సిబ్బందితో చర్చించారు.

Follow Us:
Download App:
  • android
  • ios