కుప్పకూలిన సిబిఎస్ బస్టాండ్ (వీడియో)

First Published 5, Jul 2018, 10:57 AM IST
CBS Bus Stand Shed collapsed In GowliGuda
Highlights

ఎన్నో ఏళ్లుగా హైదరాబాద్ నగరవాసులకు సేవలందిస్తున్న సిబిఎస్ బస్టాండ్ ఇవాళ హటాత్తుగా కుప్పకూలింది. అయితే ఆర్టీసి అధికారులు ప్రమాదాన్ని ముందే పసిగట్టి అప్రమత్తమవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం సంబంవించలేదు.

హైదరాబాద్ గౌలిగూడ లో మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ఎదురుగా సిటీ బస్సుల కోసం బస్టాండ్ ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కొన్నేళ్ల క్రితం రేకులతో భారీ షెడ్డును నిర్మించి అందులో బస్టాండ్ నిర్వహిస్తున్నారు. ఇరు తెలుగు రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు వచ్చే ప్రజలు సిటీలో ఎక్కడికి చేరుకోవాలన్నా ఈ బస్టాండ్ ను ఆశ్రయించాల్సిందే. దీంతో ఎల్లపుడూ సిబిఎస్ ప్రయాణికులతో కిక్కిరిసిపోయి ఉండేది.

అయితే ఈ రేకులతో పాటు దానికి ఆదారంగా వేసిన ఇనుప రాడ్లు తుప్పుపట్టిపోయాయి. అసలే శిథిలావస్థకు చేరిన షెడ్డుకు ఈ వర్షాల వల్ల ఎప్పుడైనా ప్రమాదం సంభవించొచ్చని బావించిన ఆర్టీసి అధికారులు మూడు రోజుల క్రితమే దీన్ని మూసేశారు. బస్సులను అందులోకి అనుమతించకుండా భారీకేడ్లను ఏర్పాటు చేశారు. వారు ఊహించినట్లు ఇవాళ
ఉదయం భారీ శబ్దం చేస్తూ షెడ్డు ఒక్కసారిగా కుప్పకూలింది. అధికారుల అప్రమత్తమవడంతో ఫెను ప్రమాదం తప్పింది.

వీడియో

"
 
loader