గ్రానైట్ మైనింగ్ (granite mining) అక్రమాలపై సీబీఐ (cbi) ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ మేరకు ప్రాథమిక విచారణ ప్రారంభించారు విశాఖ  సీబీఐ అధికారులు. ఢిల్లీలో వున్న సీబీఐ ఉన్నతాధికారులకు పేరాల శేఖర్ రావు ఫిర్యాదు చేశారు. కాకినాడ పోర్టు (kakinada port) నుంచి విదేశాలకు గ్రానైట్ తరలించినట్లు సీబీఐ అధికారులు తేల్చారు. 

గ్రానైట్ మైనింగ్ (granite mining) అక్రమాలపై సీబీఐ (cbi) ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ మేరకు ప్రాథమిక విచారణ ప్రారంభించారు విశాఖ సీబీఐ అధికారులు. ఢిల్లీలో వున్న సీబీఐ ఉన్నతాధికారులకు పేరాల శేఖర్ రావు ఫిర్యాదు చేశారు. పేరాల నుంచి మరింత సమాచారం కోరారు సీబీఐ అధికారులు. కరీంనగర్ గ్రానైట్ (karimnagar granite case) భారీగా విదేశాలకు ఎగుమతి అవుతున్నట్లుగా గుర్తించారు. కాకినాడ పోర్టు (kakinada port) నుంచి విదేశాలకు గ్రానైట్ తరలించినట్లు సీబీఐ అధికారులు తేల్చారు. 

కాగా.. కరీంనగర్‌లోని 9 గ్రానైట్ క్వారీలకు గతేడాది ఆగస్టు 3న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (enforcement directorate) నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎంపీ, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫిర్యాదుతో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ నోటీసుల్లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. వివిధ దేశాలకు గ్రానైట్ ఎగుమతి చేశారని సంజయ్ ఫిర్యాదులో తెలిపారు. 

కరీంనగర్ నుంచి కాకినాడ, కృష్ణపట్నం మీదుగా విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేస్తున్నాయి ఆ క్వారీ సంస్థలు. ఇదే కేసుకు సంబంధించి అదే ఏడాది జూలైలో చెన్నైలోని ఎలైట్ షిప్పింగ్ ఏజెన్సీకి నోటీసులు జారీ చేసింది ఈడీ. తాజాగా శ్వేత ఏజెన్సీ, ఏఎస్ షిప్పింగ్, జేఎం బ్యాక్సీ గ్రానైట్, మైథిలి ఆదిత్య ట్రాన్స్‌పోర్ట్, కేవీఏ ఎనర్జీ, అరవింద్, శాండియా ఏజెన్సీస్, పీఎస్ఆర్ ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ అండ్ లాజిస్టిక్స్ కంపెనీలకు నోటీసులు జారీ చేసింది.