Asianet News TeluguAsianet News Telugu

సుజనా కార్యాలయాల్లో రెండో రోజూ సీబీఐ సోదాలు

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కార్యాలయాల్లో సీబీఐ ఆదివారం నాడు కూడ సోదాలు కొనసాగిస్తున్నారు. శనివారం నుండి సుజనా చౌదరి కార్యాలయం, ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
 

cbi raids on sujana chowdhary offices in hyderabad
Author
Hyderabad, First Published Jun 2, 2019, 1:02 PM IST


హైదరాబాద్: కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కార్యాలయాల్లో సీబీఐ ఆదివారం నాడు కూడ సోదాలు కొనసాగిస్తున్నారు. శనివారం నుండి సుజనా చౌదరి కార్యాలయం, ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

కర్ణాటక రాష్ట్రంలో ఆంధ్రాబ్యాంకుతో పాటు మరో రెండు బ్యాంకుల నుండి రుణాలను తీసుకొని  రుణాలను ఎగ్గొట్టారని కేసు నమోదయ్యాయి. బెస్ట్ అండ్ క్రాంప్టన్ సంస్థ ఎండీ శ్రీనివాసరావుతో పాటు నలుగురు డైరెక్టర్లపై సీబీఐ అధికారులు 2017లో కేసులు నమోదు చేశారు.

బ్యాంకు నుండి తీసుకొన్న రుణాలు... సుజనా చౌదరి చెందిన బినామీ సంస్థలకు మళ్లించినట్టు సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై రెండు రోజులుగా సుజనా చౌదరి కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

పంజగుట్టలో శనివారం నాడు సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారులు కీలకమైన హార్డ్‌ డిస్క్‌లను స్వాధీనం చేసుకొన్నారు.  ఆదివారం నాడు కూడ సుజనా చౌదరి కార్యాలయంలో కూడ సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios