సీఎం కేసీఆర్‌తో ముగిసిన కల్వకుంట్ల కవిత సమావేశం.. 45 నిమిషాల పాటు భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య భేటీ జరిగింది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశం ముగిసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమెను సీబీఐ అధికారులు విచారించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను కేసీఆర్‌కు కవిత వివరించారు. దాదాపు 45 నిమిషాల పాటు వీరిద్దరి మధ్య భేటీ జరిగింది. అనంతరం ఆమె ప్రగతి భవన్ నుంచి తన నివాసానికి చేరుకున్నారు. అటు సీబీఐ అధికారులు సైతం ఢిల్లీకి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
ఇదిలావుండగా.. కవిత నుండి సమాచారం సేకరించేందుకు గాను సీబీఐ అధికారులు రావడానికి అరగంట ముందే న్యాయవాదులు కవిత ఇంటికి వచ్చారు. సీబీఐ అధికారులు కవిత న్యాయవాది సమక్షంలో ఈ విషయమై సమాచారాన్ని సేకరిస్తున్నారని సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఉంది. అమిత్ ఆరోరా రిమాండ్ రిపోర్టు వెలుగు చూసిన మరునాడే కవితకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులిచ్చారు. ఈ నోటీసులకు ఈ నెల 6వ తేదీన తాను సిద్దంగా ఉంటానని కవిత తొలుత సమాచారం ఇచ్చారు.
ALso Read:సీఎం కేసీఆర్‌తో కల్వకుంట్ల కవిత భేటీ... సీబీఐ విచారణపై వివరణ
ఈ నెల 3వ తేదీన ఉదయం ప్రగతి భవన్ లో కేసీఆర్ ,కవితలు న్యాయ నిపుణులతో ఈ విషయమై చర్చించారు. ఈ చర్చలు ముగిసిన తర్వాత సీబీఐకి కవిత లేఖ రాసింది. ఈ కేసుకు సంబంధించి చార్జీషీట్, ఎఫ్ఐఆర్‌ను పంపాలని కవిత లేఖ రాసింది. ఈ లేఖలకు సంబంధించి సీబీఐ కవితకు సమాచారం పంపింది. అయితే ఎఫ్ఐఆర్, చార్జీషీట్లలో తన పేరు లేదని కవిత పేర్కొన్నారు. అంతేకాదు ఈ విషయమై సీబీఐకి సహకరిస్తానని కవిత స్పష్టం చేశారు. ఈ నెల 11,12, 14, 15 తేదీల్లో తాను హైద్రాబాద్ లో ఉంటానని సీబీఐకి సమాచారం పంపారు. ఈ సమాచారంపై సీబీఐ అధికారులు ఈ నెల 6వ తేదీన స్పందించారు. ఈ నెల 11న సమాచార సేకరణకు వస్తామని కవితకు సీబీఐ అధికారులు మెయిల్ ద్వారా సమాచారం పంపారు. ఈ కేసులో సమాచార సేకరణలో భాగంగా కవిత ఇంటికి ఇవాళ సీబీఐ అధికారుల బృందం వచ్చింది.