హైదరాబాద్: జీవీకే కేసు దర్యాప్తులో సీబీఐ కొత్త విషయాలను  కనుగొన్నట్టుగా సమాచారం. జీవీకే కుటుంబసభ్యులు, ఉద్యోగుల పేర్లతో కంపెనీలు సృష్టించి  నిధులు మళ్లించినట్టుగా సీబీఐ అధికారులు గుర్తించారని తేలింది.

రూ. 395 కోట్ల నిధులను వివిధ కంపెనీలకు మళ్లించినట్టుగా సీబీఐ గుర్తించింది. ఐశ్యర్యగిరి కన్ స్ట్రక్షన్ కంపెనీ, సుభాష్ ఇన్ ఫ్రా ప్రైవెట్ లిమిటెడ్,ఆక్వాటెక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఒమిని ఇండియా ప్రాజెక్టు, నైస్ ప్రాజెక్టు లిమిటెడ్, అదితి ఇన్పో బిల్డ్ సర్వీసుల పేర్లతో కంపెనీల ఏర్పాటు చేసినట్టుగా సీబీఐ విచారణలో గుర్తించింది.

also read:జీవీకె కుంభకోణంలో పింకిరెడ్డి పాత్ర: సీబిఐ ఎఫ్ఐఆర్ లో పేరు

తప్పుడు ఇన్ వాయిస్ ల పేరుతో ఈ నిధులను మళ్లించినట్టుగా సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పింకిరెడ్డి డైరెక్టర్ గా ఉన్న ఆర్బిట్ ట్రావెల్స్ కంపెనీకి భారీ మొత్తంలో నిధులను మళ్లించినట్టుగా సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు.

ఎయిర్ పోర్టు పక్కనే 200 ఎకరాల్లో అభివృద్ధి పేరుతో నిధులను బదలాయించినట్టుగా గుర్తించారు. మరో వైపు హైద్రాబాద్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొన్నట్టుగా సీబీఐ గుర్తించింది. 

ముంబై ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో భారీగా నిధులను దుర్వినియోగం చేసినట్టుగా జీవీకే కంపెనీపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ మేరకు రెండు రోజుల క్రితం పింకిరెడ్డి కంపెనీపై కూడ సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.