Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లోనూ సీబీఐ రూ. 2 వేల నోట్లు

ఆర్ బీ ఐ ముద్రించాల్సిన రూ. 2 వేల నోట్లను ఢిల్లీలోని సీబీఐ ముద్రించింది. ఇప్పుడవి హైదరాబాద్ లోనూ దొరుకుతున్నాయి.

cbi fake notes find in hyderabad too

రెండు వేల నోట్లు ఏ ముహుర్తాన ముద్రించారో కానీ వాటికి నకిలీ బెడద వైరస్ లా సోకింది.

 

ఇటీవల ఢిల్లీలో చిన్న పిల్లల ఉత్తిత్తి బ్యాంకు సీబీఐ (చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లు) రూ. 2 వేల నోట్లను తీసుకొచ్చింది.

 

పొరపాటున అవి ఓ బ్యాంకు ఏటీఎంలోకి చేరాయి. వాటిని డ్రా చేసిన కస్టమర్ షాక్ తిన్నాడు. బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

 

అక్కడితో సమస్య తీరంది. అయితే ఇప్పుడు ఆ సీబీఐ నోట్లు హైదరాబాద్ కు కూడా వచ్చాయి.

 

యూసుఫ్ షేక్ అనే స్టేషనరీ షాప్ యజమాని మల్కాజిగిరిలోని అలహాబాద్ బ్యాంకుకు వచ్చాడు.

 

రూ.9.90 లక్షల నోట్లను డిపాజిట్ చేసేందుకు డబ్బులు తీశాడు.  బ్యాంకు క్యాషియర్ ఆ డబ్బులను చూసి షాక్ తిన్నాడు.

 

అవి ఫేక్ నోట్లని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిందితుడిని అదపులోకి తీసుకున్న పోలీసలు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

కాగా, నిందితుడు తీసుకొచ్చిన నోట్లపై సీబీఐ అనే ముద్ర ఉందని, అచ్చంగా నిజమైన రూ. 2 వేల నోట్లు లానే ఉందని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios