Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు .. ఢిల్లీ విభాగం చేతికి దర్యాప్తు బాధ్యతలు, సీబీఐ డైరెక్టర్ ఆదేశాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఢిల్లీ విభాగానికి అప్పగించారు కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ 

cbi director assigned brs mlas poaching case to cbi delhi branch
Author
First Published Jan 6, 2023, 5:57 PM IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును తెలంగాణ హైకోర్ట్ సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ స్పందించారు. కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ ఢిల్లీ విభాగానికి ఆయన అప్పగించారు. ఇప్పటికే సిట్ నుంచి డాక్యుమెంట్లు ఇవ్వాలని తెలంగాణ సీఎస్‌కు లేఖ రాసింది సీబీఐ. సోమవారం వరకు డాక్యుమెంట్ల కోసం ఒత్తిడి తేవొద్దని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అప్పీల్‌పై తీర్పు వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సీబీఐ భావిస్తోంది. 

ఇదిలావుండగా.. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసును సీబీఐకి అప్పగించడాన్ని సవాల్ చేస్తూ  తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను హైకోర్ట్ సోమవారానికి వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బీజేపీ తరపున లాయర్ దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని, ఏ ఎమ్మెల్యేనూ కొనుగోలు చేయలేదని ఆయన తెలిపారు. 2014 నుంచి 37 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకున్నారు దామోదర్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరాలని కేసీఆర్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారని దామోదర్ రెడ్డి వాదించారు. 

ALso REad: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. తెలంగాణ ప్రభుత్వానికి సీబీఐ లేఖ

ఇకపోతే.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్ జడ్జి తీర్పును తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. దీనిని విచారణకు స్వీకరించిన కోర్ట్.. ప్రభుత్వ వాదనలు విన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. ప్రభుత్వ ఎమ్మెల్యేలను కొనాలని చూసినప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టడంలో తప్పేంటని ఆయన కోర్టుకు వివరించారు. కోర్టుకు నివేదిక అందజేసిన తర్వాత అది పబ్లిక్ డొమైన్‌లోకి వస్తుందని.. ప్రజాక్షేత్రంలోకి ఎవిడెన్స్ వచ్చిన తర్వాతనే కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు తెలిపారని దవే వాదనలు వినిపించారు. అయితే ప్రతివాదుల తరపు వాదనలు ఈరోజు కొనసాగుతున్నాయి. 

సీబీఐ తరపు న్యాయవాదులు వాదిస్తూ. .. కేసు వివరాలన్నీ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశామని హైకోర్టుకు తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా మాకెలాంటి డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని తెలిపారు. డాక్యుమెంట్లు ఇస్తేనే విచారణ మొదలెడతామని సీబీఐ తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. దీంతో జోక్యం చేసుకున్న న్యాయస్థానం.. డివిజన్ బెంచ్‌లో విచారణ పూర్తయ్యే వరకు ఆగాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ వాదన కూడా వింటామన్న కోర్ట్.. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios