హైద్రాబాద్‌ జీఎస్టీ ఆఫీస్‌లో సీబీఐ సోదాలు: లంచం తీసుకొన్న ఇద్దరి అరెస్ట్

 బషీర్‌బాగ్ లోని కస్టమ్స్ యాంటీ వింగ్ లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులు లంచం తీసుకొన్నారనే కారణంగా సీబీఐ అరెస్ట్ చేసింది. కిషన్ పాల్, సురేష్ లు రూ. 20 వేలు లంచం తీసుకొన్నారని సీబీఐ ఆరోపించింది.

CBI arreted two customs officials in Bribery case

హైదరాబాద్: Hyderabad నగరంలోని బషీర్ బాగ్ లో గల Gst కార్యాలయంలోని గల Customs  యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులనుCbi మంగళవారం నాడు అరెస్ట్ చేసింది. ఓ వ్యాపారి నుండి లంచం తీసుకొన్నారని వీరిద్దరిని సీబీఐ అరెస్ట్ చేసింది.కస్టమ్స్  యాంటీ విస్సన్ వింగ్ లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్ కిషన్ పాల్, సూపరిండెంట్ సురేష్ కుమార్‌లను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఇద్దరు అధికారులకు రూ. 20 వేలు లంచం ఇచ్చి సీబీఐకి ఫిర్యాదు చేశాడు బాధితుడు మీర్ అస్ఘర్. ఈ ఇద్దరు అధికారులు లంచం తీసుకొంటున్న సమయంలో సీబీఐ అధికారులు సోమవారం నాడు దాడులు నిర్వహించారు.

also read:హైద్రాబాద్‌లో సోదాలు: ఇద్దరిని ట్రాప్ చేసిన సీబీఐ

ఈ దాడుల తర్వాత  Kishan paul , Suresh లను అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది సీబీఐ. వీరిద్దరూ లంచం తీసుకొన్నారని సీబీఐ నిర్ధారణ చేసుకొంది. దీంతో మంగళవారం నాడు నిందితులను అరెస్ట్ చేసింది.హైకోర్టు ఆదేశాలతో విడుదలైన వ్యక్తి నుండి ఈ ఇద్దరు అధికారులు లంచం తీసుకొన్నారని సీబీఐ చెబుతుంది. వీరిద్దరని కోర్టులో హాజరుపర్చారు  సీబీఐ అధికారులు.Gst అమలైన తర్వాత వ్యాపారులు సక్రమంగా పన్నులు చెల్లించకుండా ఉన్న వారిపై కొందరు అధికారులు పన్నులు వసూలు కాకుండా ఉండేందుకు గాను అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.  దీంతో  ఈ విషయమై సీబీఐకి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల ఆధారంగా సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios