Asianet News TeluguAsianet News Telugu

పశువులు కూరగాయల మొక్కలు మేశాయని.. దళితుడిని స్తంభానికి కట్టి చిత్రహింసలు..

తన పొలంలో పశువులు మేశాయని.. ఓ వ్యక్తి దళితుడిని స్తంభానికి  కట్టివేసి, కొట్టాడు. వీడియో వైరల్ గా మారింది. 

Cattle grazed vegetable plants, Dalit was tied to a pole and tortured In mancherial - bsb
Author
First Published Aug 12, 2023, 11:42 AM IST

మంచిర్యాల : తెలంగాణలోని మంచిర్యాలలో అమానుష ఘటన వెలుగు చూసింది. తన పొలంలో ఎద్దులు పంట మేశాయని.. వాటి యజమాని అయిన దళిత వ్యక్తిని స్తంభానికి కట్టేసి కొట్టాడో వ్యక్తి. మంచిర్యాల కోటపల్లి మండలం శెట్‌పల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. దుర్గం బాబు అనే బాధితుడు తన రెండు ఎద్దులను సూరం రాంరెడ్డికి చెందిన పొలంలో మేపినందుకు ఈ "శిక్ష" విధించాడని ఆరోపించారు.

ఇది వెలుగులోకి రావడంతో సూరం రాంరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ (అట్రాసిటీ నిరోధక) చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కోటపల్లి పోలీసులు శుక్రవారం తెలిపారు. "ఎఫ్‌ఐఆర్ నమోదు చేశాం, ఈ కేసు దర్యాప్తులో ఉంది" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

శంషాబాద్‌లో మహిళా హత్య కేసులో పురోగతి.. ఆమె ఎవరనేది గుర్తింపు.. కడుపు నొప్పి అని బయటకు వెళ్లి..!!

బాబును స్తంభానికి కట్టేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిమీద బాధితుడు బాబు మాట్లాడుతూ.. రాంరెడ్డి తన ఇంటికి వచ్చి, తన షర్ట్ కాలర్‌ పట్టుకుని అతడి ఇంటికి తీసువెళ్లాడని.. అక్కడ తనని బాగా కొట్టాడని ఆరోపించాడు. 

అంతేకాదు.. ‘‘రాంరెడ్డి ఇంటి తాళం పగలగొట్టానని నాపై ఫేక్ కేసు పెడతానని బెదిరించాడు. నా మెడలో ఉన్న టవల్‌తో గట్టిగా పట్టుకుని లాగాడు’’ అని బాబు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో వెలుగు చూసింది. దీంతో తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 

రాంరెడ్డిని చట్ట ప్రకారం శిక్షించాలని దళిత సంఘాలు డిమాండ్ చేయడంతో గురువారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
రాంరెడ్డి ఆవరణలోని కొన్ని కూరగాయల మొక్కలను బాబు పశువులు మేసినట్లు వారు తెలిపారు. 

"ఇది రాంరెడ్డికి కోపం తెప్పించింది, అతను బాబు ఇంటికి వెళ్లి, అతనిని తన ఇంటికి తీసుకువచ్చాడు. బాబు చేతులు కర్ర స్తంభానికి కట్టాడు" అని దళిత సంఘ సభ్యుడు ఒకరు చెప్పారు.గ్రామస్తులు జోక్యం చేసుకుని.. బాబుని విడిచిపెట్టాలని రాంరెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చేవరకు అతను బాబును విడుదల చేయలేదని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios