Asianet News TeluguAsianet News Telugu

భూవివాదంలో కుల బహిష్కరణ.. చిన్నమ్మ చనిపోయినా రానివ్వని వైనం.. సుల్తానాబాద్ లో ఘటన..


గ్రామాల్లో ఇంకా మూఢ ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. కుల పెద్దలు పెట్టిన కఠిన నియమాలను అందరూ పాటిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఓ కుటుంబాన్ని కుల పెద్దలు వెలేశారు. దీంతో వారికి ఎవరూ కనీసం పాలు కూడా పోయడం లేదు. 
 

Caste boycott in land dispute .. I will not come even if my grandmother dies .. Incident in Sultanabad ..
Author
Hyderabad, First Published Dec 20, 2021, 1:55 PM IST

టెక్నాలజీ ఎంత పెరిగినా కొన్ని మూఢ ఆచారాలు ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి. మ‌నిషి త‌న మేధాశ‌క్తితో రాకెట్ల ద్వారా అంత‌రిక్షాన్ని చుట్టి వ‌స్తున్నా.. ఇంకా అంద విశ్వాషాలు తొల‌గిపోవ‌డం లేదు. క్ష‌ణాల్లో సుదూర దూరంలో ఉన్న వారితో మాట్లాడ‌గ‌లిగే మ‌నుషులు.. కులా వివ‌క్ష పేరుతో తోటి మ‌నుషుల‌ను దూరం చేసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో నేటికి గ్రామాల్లో కుల బ‌హిష్క‌ర‌ణ‌లు, వివ‌క్ష‌లు క‌నిపిస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఘ‌ట‌నే పెద్ద‌ప‌ల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాంతంలో జ‌రిగింది. నేటి స‌మాజంలో ఇంకా కూడా కుల బ‌హిష్క‌ర‌ణ‌లు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని ఈ ఘ‌ట‌న రుజువు చేస్తోంది. 

భూ వివాదంతో మొద‌లై...

వారు ముగ్గురు అన్న‌ద‌మ్ములు. అందులో ఇద్దరు విక‌లాంగులు. క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుతో గ్రామంలోని ఓ వ్య‌క్తి వ‌ద్ద స్థ‌లం కొనుగోలు చేశారు. అందులో ఇళ్లు క‌ట్టుకుందామ‌ని భావించారు. కానీ ఆ స్థ‌లం కుల సంఘం కోసం కావాల‌ని కుల పెద్ద‌లు కోరారు. దీనికి ఆ ముగ్గురు అన్న‌ద‌మ్ములు సుముఖ‌త వ్య‌క్తం చేశారు. దీంతో అన్న‌ద‌మ్ముల‌కు భూమి విక్ర‌యించిన వ్య‌క్తి నుంచే కుల పెద్ద‌ల‌కు ఆ భూమిని రిజిస్ట్రేష‌న్ చేయించారు. అయితే ఆ భూమి అమ్మిన వ్య‌క్తి ఇటీవ‌ల కాలంలో చ‌నిపోయారు. దీంతో కుల పెద్ద‌లు ఆ భూమికి కొల‌త‌లు వేయించారు. ఆ కొల‌త‌ల్లో భూమి కొంత త‌క్కువ‌గా వ‌చ్చింది. దీంతో ఆ ముగ్గురు అన్న‌ద‌మ్ముల‌ను పిలిచి.. పూర్తి భూమి చూపించాల‌ని కోరారు. అప్పుడే కొల‌త‌లు కొలిచి ఉండే ఈ స‌మ‌స్య వ‌చ్చేది కాద‌ని, ఇప్పుడు మొత్తం భూమిని ఇచ్చే బాధ్య‌త ముగ్గురు అన్న‌ద‌మ్ముల‌దే అని కుల సంఘ పెద్ద‌లు చెప్పారు. ఎప్పుడో అమ్మేసిన భూమిని ఇప్పుడు తెచ్చివ్వాల‌ని వారు తెల‌ప‌డంతో కుల సంఘానికి ఆగ్ర‌హం వ‌చ్చి వారిని వెలేసింది. దీంతో వారు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. 

సోదరుడి ఇంట్లోనే గుట్టుగా వ్యభిచార గృహం.. ఓ మహిళ ఘాతుకం...

స‌భ్య స‌మాజం త‌ల‌దించుకునే ఈ ఘ‌ట‌న పెద్ద పల్లి జిల్లాలోని సుల్తానాబాద్‌ మండలం గట్టెపల్లి లో జ‌రిగింది. ఆ గ్రామానికి చెందిన సమ్మయ్య, మల్లయ్య, రాజయ్యలు ముగ్గ‌రు అన్న‌ద‌మ్మ‌లు. వీరిలో మ‌ల్ల‌య్య‌, రాజ‌య్య‌లు విక‌లాంగులు. అదే గ్రామానికి చెందిన అబ్దుల్ అలీ వ‌ద్ద 6 గుంట‌ల భూమిని గ‌తంలో కొనుగోలు చేశారు. ఈ భూమిని రిజిస్ట్రేష‌న్ చేయించుకోకుండా పేప‌ర్ మీద రాయించుకున్నారు. అయితే కొంత కాలం త‌రువాత ఆ స్థ‌లం కుల సంఘం ఉప‌యోగించుకోవ‌డానికి కావాల‌ని కుల సంఘ పెద్ద‌లు కోరారు. దీనికి ఆ ముగ్గురు అన్న‌ద‌మ్ములు కూడా ఒప్పుకున్నారు. 2008 సంవ‌త్స‌రంలో అబ్దుల్ అలీ పేరుతో ఉన్న భూమిని కుల సంఘంతో రిజిస్ట్రేష‌న్ చేయించారు. ఇటీవ‌ల అత‌ను మృతి చెందాడు. దీంతో ఆ స్థ‌లాన్ని కొల‌త‌లు వేయించ‌గా.. కొంత భూమి త‌క్కువ‌గా వ‌చ్చింది. దీనికి ఆ ముగ్గురు అన్న‌ద‌మ్ములే కార‌ణ‌మ‌ని, అప్పుడే భూమికి కొల‌త‌లు వేయిస్తే స‌మ‌స్య ఉండ‌క‌పోయేద‌ని అన్నారు. ఆ భూమి మొత్తం ఇప్పించే బాధ్య‌త మీదే అని ఆ అన్న‌ద‌మ్ములను ఆదేశించారు. ఇంద‌లో త‌మ త‌ప్పేమి లేద‌ని, భూమిని కొనుగోలు చేసి అందులో ఎటువంటి మార్పులు చేయ‌కుండా అమ్మేశామ‌ని తెలిపారు. భూ స‌మ‌స్యకు ప‌రిష్కారం చూపే వ‌ర‌కు కుల నుంచి బ‌హిష్క‌రిస్తున్నామ‌ని ఆ కుల సంఘం పెద్ద‌లు తీర్మాణించారు. వారికి సాయం చేసిన వారికి, మాట్లాడిన వారికి రూ.50 వేల ఫైన్ వేస్తామ‌ని కుల‌స్తుల‌ను హెచ్చ‌రించారు. దీంతో ఎవ‌రూ ఆ ముగ్గురు అన్న‌దమ్ముల‌తో మాట్లాడ‌టం లేదు. ఈ క్ర‌మంలో స‌మ‌య్య, మ‌ల్ల‌య్య‌, రాజ‌య్య‌ల‌కు వ‌రుస‌కు చిన‌త‌ల్లి అయ్యే మ‌ల్ల‌మ్మ మృతి చెందింది. ఆమెను క‌డ‌సారి చూసేందుకు కూడా కుల సంఘం పెద్ద‌లు ఒప్పుకోలేదు. కనీసం ఆ కుటుంబానికి పాలు కూడా ఎవ‌రూ పోయడం లేదు. ప‌క్క‌న‌ ఉన్న సుల్తానాబాద్ కు స‌మ‌య్య‌. ప్ర‌తీ రోజు వెళ్లి పాలు, కావాల్సిన స‌రుకులు తెచ్చుకుంటున్నారు. క‌నీసం ఇద్ద‌రు విక‌లాంగుల‌ను చూసి అయినా జాలిప‌డ‌టం లేద‌ని స‌మ‌య్య ఆదేవ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచార‌ణ జరుపుతున్నామ‌ని, వివాదం నెల‌కొన్న భూమి ప్ర‌స్తుతం లేద‌ని పోలీసులు చెపుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios