క్యాసినో కేసులో విచారణ ఎదుర్కొంటున్న నిందితుడు చీకోటి ప్రవీణ్ తాజాగా థాయ్ లాండ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అతనితో పాటు 14మంది మహిళలకు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
థాయిలాండ్ : క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ను థాయిలాండ్లో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో మరోసారి చీకోటి ప్రవీణ్ వార్తల్లో నిలిచాడు. థాయిలాండ్ లోని టాస్క్ ఫోర్స్ పోలీసులు అక్కడి పటాయాలో మొత్తం 90 మంది ఉన్న ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠాను అరెస్టు చేశారు. ఈ 90మందిలో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడని సమాచారం. అంతేకాదు ఈ ముఠాలో మహిళలు 14 మంది ఉన్నారని వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ 90 మంది నుంచి భారీగా నగదును.. గేమింగ్ చిప్స్ ను థాయిలాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ గ్యాంబ్లింగ్ అంతా చీకోటి ప్రవీణ్ నేతృత్వంలోనే నిర్వహిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. 20 కోట్ల రూపాయల నగదు, ఎనిమిది క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాలు, 92 మొబైల్ ఫోన్లు, మూడు నోట్ బుక్ లను ఈ దాడిలో పోలీసులు సీజ్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తెలుగు టీవి ఛానల్లో అశ్లీల వీడియోల ప్రసారం... అవాక్కయిన ప్రేక్షకులు
దీంతో ముఖ్య నేరస్తుడిగా ఉన్న చీకోటి ప్రవీణ్ ను స్పెషల్ బృందాలు అదుపులోకి తీసుకున్నాయని.. అతడిని విచారిస్తున్నట్లుగా సమాచారం. థాయిలాండ్ లో కఠినమైన చట్టాలు ఉంటాయి. నేరం చేసినట్లు నిరూపితమైతే చాలా దారుణమైన శిక్షలు పడతాయి అన్న విషయం తెలిసిందే. దీంతో, చీకోటి ప్రవీణ్ దొరికిపోవడంతో అతని మీద ఎలాంటి శిక్షలు పడతాయోనని అతని అనుచరుల్లో ఆందోళన నెలకొంది.
థాయిలాండ్ లోని ఒక హోటల్లో ఏప్రిల్ 27 నుంచి అందులోనే కాన్ఫరెన్స్ హాల్ను రెంటుకి తీసుకొని ఈ గ్యాంబ్లింగ్ తతంగం నడుపుతున్నట్లుగా వెలుగు చూసింది. ఈ వ్యవహారంలో ఓ మహిళ కీలకంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ మహిళ కూడా పోలీసుల అదుపులోనే ఉన్నారు. ఈ గ్యాంబ్లింగ్ కోసం థాయిలాండ్ లో చీకోటి ప్రవీణ్ ఒక్కొక్కరి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఇక పటాయ పోలీసుల అదుపులో చీకోటి ప్రవీణ్ తో పాటు.. డిసిసిబి చైర్మన్ దేవేందర్ రెడ్డి, మాధవరెడ్డి కూడా ఉన్నారు. పోలీసులను చూసిన వెంటనే తప్పించుకోవడానికి ఈ ముఠా ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది. కాగా టాస్క్ ఫోర్స్ పోలీసులు వారిని వెంబడించి మరీ పట్టుకున్నట్లు సమాచారం. చీకోటి ప్రవీణ్ థాయిలాండ్ లో పట్టుబడినట్లుగా ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తెలంగాణలో క్యాసినో వ్యవహారంలో ప్రవీణ్ ఇప్పటికీ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
