ఓటుకు నోటు కేసు: రేవంత్ పిటిషన్ పై విచారణ ముగించిన సుప్రీంకోర్టు

ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు విచారణను ముగించింది.

Cash for Vote: Supreme Court Dismisses Revanth Reddy Petition lns


న్యూఢిల్లీ: ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను ముగించింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్ కోరుతూ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఒకేసారి ఐదుగురి క్రాస్ ఎగ్జామినేషన్  చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.సాక్షుల విడివిడి క్రాస్ ఎగ్జామినేషన్ కు గతంలో ప్రత్యేక కోర్టు ఆదేశించింది.అందరిని ఒకేసారి క్రాస్ ఎగ్జామ్ చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి వినతిని గతంలో  ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.ప్రత్యేక కోర్టు తీర్పును రేవంత్ రెడ్డి  హైకోర్టులో సవాల్ చేశారు.ప్రత్యేక కోర్టు నిర్ణయాన్ని సమర్ధిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి పిటిషన్ పై ఐదు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత ఎలాంటి నిర్ణయం వెల్లడించని హైకోర్టు.హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇవాళ సుప్రీంకోర్టుకు రేవంత్ రెడ్డి తెలిపారు.హైకోర్టు ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినందున విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు తెలిపింది.హైకోర్టు పరిధిలో నిర్ణయం ఉన్నందున  విచారణను ముగిస్తున్నట్టుగా సుప్రీంకోర్టు వివరించింది.డిస్మిస్ చేసింది.ఓటుకు నోటు కేసు ఏసీబీ పరిధిలోకి రాదని రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు  ఇవాళ డిస్మిస్ చేసింది.

2015 మే మాసంలో ఓటుకు నోటు కేసు నమోదైంది. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో  బీఆర్ఎస్ నామినేటేడ్ ఎమ్మెల్సీ  స్టీఫెన్ సన్ ను రేవంత్ రెడ్డి  డబ్బులు ఇస్తున్న సమయంలో  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టుగా  ఏసీబీ అభియోగాలు మోపింది.ఈ కేసులో రేవంత్ రెడ్డిని  అరెస్ట్ చేశారు. ఏసీబీ ఆరోపణలను అప్పట్లోనే రేవంత్ రెడ్డి  తోసిపుచ్చారు.ఈ ఘటన జరిగిన సమయంలో  రేవంత్ రెడ్డి టీడీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు.

ఆ తర్వాత  చోటు చేసుకున్న పరిణామాల్లో రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ లో చేరారు. ప్రస్తుతం  రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా  కొనసాగుతున్నారు.ఓటుకు నోటు కేసులో గతంలోనే ఈడీ  చార్జీషీట్ దాఖలు చేసింది.ఈ చార్జీషీట్ లో రేవంత్ రెడ్డిపై  అభియోగాలు మోపింది.2020 మార్చిలో  ఓటుకు నోటు కేసులో ఏసీబీ చార్జీషీట్ దాఖలు చేసింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తరపున వేం నరేందర్ రెడ్డిని బరిలోకి దింపింది ఆ పార్టీ.  వేం నరేందర్ రెడ్డిని గెలిపించేందుకు బీఆర్ఎస్ కు చెందిన నామినేటేడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ కు డబ్బులిస్తున్న సమయంలో  ఏసీబీ అధికారులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారని  ఏసీబీ ఆరోపించింది.

also read:తెరపైకి మరోసారి ఓటుకు నోటు కేసు: చంద్రబాబుపై ఆళ్ల దాఖలు చేసిన పిటిషన్ ఈ నెల 4న సుప్రీంలో విచారణ

ఇదిలా ఉంటే  ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలని వైసీపీకి చెందిన  మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు  ఈ కేసును తెలంగాణ ఏసీబీ నుండి కాకుండా సీబీఐ విచారణకు ఆదేశించాలని మరో పిటిషన్ దాఖలు చేశారు.ఈ రెండు పిటిషన్లపై విచారణ ఈ నెల  4న సుప్రీంకోర్టులో జరగనుంది. 2017లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ పిటిషన్లు దాఖలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios