తెలంగాణలోని ఎసిబి అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున రెడ్డిపై కేసు ఫైల్ అయింది.

తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి తన భార్య సునీతా రెడ్డిని లొంగదీసుకున్నాడు అంటూ పోలీసులకు సునీతారెడ్డి భర్త సురేందర్ రెడ్డి ఫిర్యాదు చేశారు.

సునీతారెడ్డి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు ఐపిసి 447, 497, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత సునీతారెడ్డి ఇంటికి కల్వకుర్తి సిఐ మల్లిఖార్జున్ రెడ్డి వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా సునీతారెడ్డి భర్త, తల్లి, అత్త కలిసి మల్లిఖార్జునరెడ్డికి చెప్పులతో దేహశుద్ధి చేశారు. ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద దుమారమే రేపుతోంది.

ఈ నేపథ్యంలో సునీతారెడ్డి భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపిహెచ్ బి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.