వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో జోరుగా కార్ రేసింగ్ జరుగుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
హైదరాబాద్: వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో జోరుగా కార్ రేసింగ్ జరుగుతోంది. అగస్టు 15న సెలవు రోజు కావడంతో అనంతగిరి కొండలకు భారీగా వెళ్లిన యువతీ, యువకులు కార్ల రేసింగ్ నిర్వహించారు. సైరన్ వేసుకుంటూ దూసుకువచ్చి విన్యాసాలు నిర్వహించి హంగామా సృష్టించారు. బైక్ లతో స్టంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించిన పలువురు వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. అయితే అనంతగిరి కొండల్లో కార్ల రేసింగ్ నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీకెండ్స్‌లో హైదరాబాద్ నుంచి వస్తున్న కొందరు అనంతగిరి కొండల్లో కార్ల రేసింగ్ నిర్వహిస్తున్నారని స్థానికులు చెబుుతన్నారు. కార్ల రేసింగ్‌ను అరికట్టాలని స్థానికులు పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కార్ల రేసింగ్‌తో పర్యాటకులకు ఇబ్బంది కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
