హైద్రాబాద్ నగరంలోని మైలార్ దేవ్ పల్లిలో  రోడ్డు ప్రమాదం చోటు  చేసుకుంది.

హైదరాబాద్: నగరంలోని మైలార్‌దేవ్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆల్టో కారు టైర్ పేలింది. దీంతో కారు అదుపు తప్పి కుడి వైపు నుండి వెళ్తున్న లారీ ముందుకు కారు వెళ్లింది. ఆకస్మాత్తుగా కారు ఎదురు రావడంతో లారీని డ్రైవర్ అదుపు చేయలేకపోయాడు. దీంతో కారును లారీ కొద్దిదూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లింది. దీంతో కారులోని ప్రయాణీకులు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.

Scroll to load tweet…

దుర్గానగర్ నుండి చాంద్రాయణ్ గుట్ట వైపు వెళ్తున్న కారు టైర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కారులో ప్రయాణీస్తున్న వారంతా స్వల్పగాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.