8 నెలలుగా యజమానిపై కారు డ్రైవర్ అత్యాచారం, చివరికిలా..

Car driver rape on his owner at her residence
Highlights

తాను పనిచేసే యజమానిని పెళ్లి చేసుకొంటానని నమ్మించి ఖయ్యూం అనే కారు డ్రైవర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచ ేసుకొంది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.


కరీంనగర్: తాను పనిచేస్తున్న యజమానిని నమ్మించి లైంగికదాడికి పాల్పడ్డారు ఓ  కారు డ్రైవర్‌. నిందితుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.  తనను పెళ్లి చేసుకొంటానని నమ్మించి  తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు  చెబుతోంది.ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకొంది.

కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన  ఓ వివాహిత  భర్తతో విబేధాల కారణంగా  విడాకులు తీసుకోని పిల్లలతో కలిసి ఒంటరిగా నివాసం ఉంటుంది. టైల్స్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది.  అయితే  తన వద్ద కారు డ్రైవర్ గా ఖయ్యూం అనే వ్యక్తిని నియమించుకొంది.

అయితే యజమాని వద్ద కారు డ్రైవర్ గా పనిచేస్తున్న ఖయ్యూం ఆమెపై కన్నేశాడు.బాధితురాలిని నమ్మించి ఆమెను పెళ్లి చేసుకొంటానని చెప్పాడు.  బాధితురాలు కూడ నమ్మింది. దీంతో బాధితురాలిపై నిందితుడు పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.8 నెలలుగా తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే కారు డ్రైవర్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు  బాధితురాలు చెబుతోంది. అయితే తనను వివాహం చేసుకోవాలని  బాధితురాలు  డిమాండ్ చేసింది.  అయితే అప్పటి నుండి  ఖయ్యూం  కన్పించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని పోలీసులకు బాధితురాలు  ఫిర్యాదు చేసింది.  తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరింది. అయితే  పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

loader