Asianet News TeluguAsianet News Telugu

వరంగల్ జిల్లాలో రోడ్డుపై తగలబడుతున్న కారు.. అందులో నోట్ల కట్టలు, అందినకాడికి దోచుకున్న జనం

వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం బోల్లికుంటలోని వాగ్దేవి కళాశాల ముందు ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో పొగలు వస్తుండటంతో అప్రమత్తమైన స్థానికులు మంటలను అర్పివేసి ఇంజిన్‌లో చూడగా కట్టల కొద్దీ డబ్బు కనిపించింది. దీంతో ఎవరికి వారు దొరికినంత సొమ్మును జేబుల్లో పెట్టుకుని పరిగెత్తారు.

car catches fire when carrying money in warangal district ksp
Author
First Published Nov 24, 2023, 3:32 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెద్ద మొత్తంలో ధనం చేతులు మారుతోంది. ఎన్నికల సంఘం, పోలీసులు, ఇతర ఇంటెలిజెన్స్ విభాగాలు ఎంతగా నిఘా పెడుతున్నా కోట్లు సరిహద్దులు దాటుతోంది. పట్టుకున్న దాని కంటే బయటికి వెళ్లేది అంతకు పదిరెట్లు వుంటుందని అంచనా. ఎక్కడ తనిఖీ చేసినా రూ. కోట్లలో డబ్బు బయటపడుతోంది. అయితే పోలీసులకు దొరక్కుండా వుండేందుకు నేతలు రకరకాల ప్లాన్లు వేస్తున్నారు. కానీ ఇవి బెడిసికొడుతున్నాయి. తాజాగా ఓ పార్టీకి చెందిన నేత కూడా కారు ఇంజిన్‌లో కోట్లు పెట్టి తరలిస్తున్నాడు. అయితే ఇంజిన్ వేడి కావడంతో డబ్బులకు మంటలు అంటుకున్నాయి. 

వరంగల్ జిల్లా ఖిల్లా వరంగల్ మండలం బోల్లికుంటలోని వాగ్దేవి కళాశాల ముందు ఓ కారులో మంటలు చెలరేగాయి. కారులో పొగలు వస్తుండటంతో అప్రమత్తమైన స్థానికులు మంటలను అర్పివేసి ఇంజిన్‌లో చూడగా కట్టల కొద్దీ డబ్బు కనిపించింది. దీంతో ఎవరికి వారు దొరికినంత సొమ్మును జేబుల్లో పెట్టుకుని పరిగెత్తారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆ కారు ఎవరిదో తేల్చే పనిలో పడ్డారు. కారులో దాదాపు రూ.25 లక్షలు వుంటుందని అంచనా. 

Follow Us:
Download App:
  • android
  • ios