హైదరాబాద్: సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓలా సంస్థకు చెందిన క్యాబ్ సీఎం క్యాంపు కార్యాలయం వద్దకు అతివేగంగా దూసుకువచ్చింది. క్యాంపు కార్యాలయం దగ్గర పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను ఢీకొట్టింది. 

దీంతో సీఎం రాకపోకల కోసం ఏర్పాటు చేసిన గేట్లు ధ్వసంమయ్యాయి. కారు బీభత్సం సృష్టించడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు యువతలకు తీవ్ర గాయాలయ్యాయి. కారు అతివేగంగా రావడంతోపాటు పోలీస్ బారికేడ్లను ఢీకొట్టడంతో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

ప్రమాదంపై వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది గాయపడిని ఇద్దరు యువతులను ఆస్పత్రికి తరలించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.