రోడ్లు రక్తమోడుతున్నాయి. ప్రాణాలను బలి గోరుతున్నాయి. రకరకాల కారణాలతో రోడ్డు మీదికి వచ్చినవారికి ఏ నిమిషంలో ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఎస్ఆర్నగర్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. 

హైదరాబాద్ : హైదరాబాద్ లోని SR nagarలో ఓ Car బీభత్సం సృష్టించింది. ఈఎస్ఐ ఆస్పత్రి మార్గం నుంచి బీకే గూడ వైపుకు అతి వేగంగా వస్తున్న కారు చౌరస్తా వద్ద స్కూటీతో పాటు మరో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 8 నెలల పసికందు కూడా ఉంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం Mulugu జిల్లా ఎర్రిగట్టమ్మ వద్ద ఘోర road accident జరిగింది. ఆటోను ఢీసీఎం వ్యాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందగా, మరో ఇద్గరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి బంధువుల్లో, స్వగ్రామంలో విషాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను warangal MGMకు తరలించారు. మృతి చెందిన వారు మంగపేట మండలం కోమటిపల్లి వాసులుగా గుర్తించారు. మృతులు అజయ్ (12), కిరణ్ (16), కౌసల్య (60), ఆటోడ్రైవర్ జానీ(23)గా గుర్తించారు. వీరంతా ఆటోలో అన్నారం షరీఫ్ దర్గాకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కాగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్శివారులోని మేడ్చల్ జిల్లాలో మార్చి 1న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తొమ్మిదిమంది వలసకూలీలు ప్రయాణిస్తున్న కారు అతివేగంగా వెళుతూ అదుపుతప్పి రోడ్డుమధ్యలో వుండే డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతిచెందగా మిగతా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు బ్రతుకుదెరువు కోసం తెలంగాణకు వసలవచ్చారు. వీరు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుంటే కుటుంబాలను పోషించుకునేవారు.

అయితే వీరిలో కొందరు రామాయంపేటలో పని వుండటంతో ఇటీవలే అక్కడికి వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తిరిగి హైదరాబాద్ కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలోనే వీరు ప్రయాణిస్తున్న కారు నగర శివారులోని మేడ్చల్ చెక్ పోస్ట్ వద్దకు రాగానే అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యింది. డ్రైవర్ మద్యంమత్తులో కారు నడపడంతో ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళుతున్న కారు మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద అదుపుతప్పి బావర్చి హోటల్ ఎదురుగా డివైడర్ కు డీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో తొమ్మిదిమంది వుండగా తీవ్రంగా గాయపడి గోరీ సింగ్, బబ్లీ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా ఏడుగురికి కూడా తీవ్రగాయాలపాలయ్యారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. అనంతరం రెండు మృతదేహాలను కూడా పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదాలు మనుషుల ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం, మద్యంమత్తు, రాంగ్ డ్రైవింగ్.. కారణం ఏదైనా కానీ రోడ్ల మీద రక్తం వరదలై పారుతోంది. రోడ్లు మృత్యునిలయాలుగా మారుతున్నాయి. రోజూ ఏదో ఒకచోట రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.