Asianet News TeluguAsianet News Telugu

రాజేంద్రనగర్ ప్రధాన రహదారిపై కారు బీభత్సం.. నలుగురికి తీవ్ర గాయాలు...

స్థానికుల సమాచారం మేరకు narsingi పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు బహదూర్ పూరా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్ గా గుర్తించారు.

car accident at rajendranagar main road, 4 injured
Author
Hyderabad, First Published Nov 10, 2021, 10:08 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రాజేంద్రనగర్ హైదర్ షాకోట్ ప్రధాన రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు డివైడర్ ను ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షత గాత్రులను హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. 

గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. సన్ సిటీ నుండి మెహదీపట్నం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా రోడ్డు కనబడక పోవడంతో అదుపు తప్పిన car డివైడర్ ఢీ కొట్టింది. కాగా ఈ సమయంలో పెద్దగా traffic లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  కారు పాక్షికంగా ధ్వంసమయ్యింది. 

స్థానికుల సమాచారం మేరకు narsingi పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు ప్రారంభించారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు బహదూర్ పూరా ప్రాంతానికి చెందిన అహ్మద్, షేక్ మతీన్, సోహేల్, ఫైసల్ గా గుర్తించారు.

తమ స్నేహితుడు జైద్  ఖాన్ ను సన్ సిటీ వద్ద వదలి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కరీంనగర్ లో కారు ప్రమాదం.. మంటలు చెలరేగినా...
కరీంనగర్‌లో అక్టోబర్ 7న ఇలాంటి ప్రమాదమే జరిగింది. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డుపక్కనన్న చెట్టుకు ఢీకొట్టింది. వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగి కారు మొత్తం దగ్దమయ్యింది. అయితే ఇలా ఒకేసారి కారు రోడ్డు ప్రమాదం, అగ్నిప్రమాదానికి గురయినా అందులో ప్రయాణిస్తున్న నలుగురు తృటితో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... karimnagar సమీపంలో ఆదివారం అర్దరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. rajeev highwayపై వేగంగా వెళుతున్న ఓ కారు వేగంగావెళుతూ అదుపు తప్పింది. దీంతో కారు రోడ్డుపైనుండి కిందకు దూసుకెళ్లి ఓ చెట్టును ఢీకొట్టి ఆగింది. ఈ ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డామని కారులోని వారు అనుకుంటుండగానే మరో ప్రమాదం వారిని చుట్టుముట్టింది. 

మితిమీరిన వేగంతో కారు చెట్టును ఢీకొనడంతో ఇంజన్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లో కారు మొత్తాన్ని వ్యాపించాయి. దీంతో చూస్తుండగానే కారు దగ్దమయ్యింది. రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన వారు వెంటనే కారులోంచి దిగడంతో అగ్నిప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఇలా రెండు ప్రమాదాల నుండి నలుగురు సురక్షితంగా బయటపడ్డారు.  

Punjagutta child dead body: చిన్నారి హత్యలో సవతి తల్లి ప్రమేయం?

ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే కరీంనగర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న కారు పూర్తిగా దగ్దమయ్యింది.  

ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ శివారులో ఔటర్ రింగ్ రోడ్డుపై కూడా ఇలాగే ఓ కారు ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకోగా ఓ డాక్టర్ సజీవ దహనమయ్యాడు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కేంద్రంలోని శివాజీ నగర్ కి చెందిన డాక్టర్ నేలపాటి సుధీర్(39) కొన్ని సంవత్సరాలుగా కేపీహెచ్ బీ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లోని కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉండేవాడు. ఆయనకు భార్య సుప్రజ, తొమ్మిది సంవత్సరాల కుమారుడు ఉన్నారు. 

సుధీర్ హైదరాబాద్ నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో  ఆర్థోపెడిక్ వైద్యుడిగా సేవలందించారు. అయితే కొంతకాలం నుంచి ఆయన వైద్య వృత్తిని వదిలి మైనింగ్ వ్యాపారం మొదలుపెట్టారు. ఈ  క్రమంలోనే బిజినెస్ పనుల్లో భాగంగా ఆయన ఒంటరిగా బయటకు వెళ్లాడు. ఔటర్ రింగ్ రోడ్డుపై వెళుతుండగా నానక్ రామ్ గూడ కూడలి వద్ద ఆయన కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆయన సజీవ దహనమయ్యారు.

ఇలా వాహనాల్లో మంటలు చెలరేగడానికి అనేక కారణాలున్నాయి. ప్రమాదాలు జరిగిన సమయంలో తరచూ ఇలా మంటలు చెలరేగుతూ  వుంటాయి. ఇక వేసవికాలంలో అయితే మండుటెండలకు వాహానాల్లోకి ఇంజన్ వేడెక్కి మంటలు చెలరేగుతుంటాయి. అలాగే సాంకేతిక కారణాలతో కూడా అప్పడప్పుడు మంటలు చెలరేగుతున్నారు. ఇలా వాహనాల్లో మంటలు చెలరేగి ప్రమాదాలకు కారణమవుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios