తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు వద్ద అభ్యర్ధుల ఆందోళన: ఉద్రిక్తత, న్యాయం చేయాలని డమాండ్
తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కార్యాలయం ముందు బుధవారంనాడు ఉద్రిక్తత చోటు చేసుకుంది. కానిస్టేబుల్ ,ఎస్ఐ పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. ప్రశ్నపత్రంలో తప్పుడు ప్రశ్నలకుమార్కులు కలపాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్:కానిస్టేబుల్ ,ఎస్ఐ పరీక్షలు రాసిన అభ్యర్ధులు బుధవారంనాడు హైద్రాబాద్ లోని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. రాత పరీక్షల సమయంలో ఇచ్చిన ప్రశ్నాపత్రంలో తప్పులు ఉన్నాయని అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. కానిస్టేబుల్ పరీక్ష పేపర్లో 22 ప్రశ్నలు, ఎస్ఐ పరీక్షలో 7 తప్పులు దొర్లాయిని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు.అంతేకాదు నెగిటివ్ మార్కులు కూడ తమ ఉద్యోగావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేశాయని అభ్యర్ధులు ఆరోపిస్తున్నారు. తప్పుడు ప్రశ్నలకు మార్కులు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. మరో వైపు ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ ను అమలు చేయాలని కోరుతున్నారు. ఈ విషయమై తమకు న్యాయం చేయాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నారు అభ్యర్ధులు. ప్రశ్నాపత్రాల్లో ఇచ్చిన తప్పుడు ప్రశ్నలు,నెగిటివ్ మార్కులు,ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమలు చేయని కారణంగా సగం మంది అభ్యర్ధులు కూడ క్వాలిఫై కాలేదని నిరసనకారులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
ఈ నెల కానిస్టేబుల్ 21న ఈ రాత పరీక్ష ఫలితాలను వెల్లడించారు. సివిల్ కానిస్టేబుల్ పరీక్షల్లో 31..40 శాతం,రవాణా శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు 44.34 శాతం, ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ పోస్టులకు 43. 65 శాతం అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించారు.
సివిల్ పోలీస్ కానిస్టేబుల్ విభాగంలో 15,664 పోస్టులు , ఎక్సైజ్ శాఖలో 614, రవాణా శాఖలో 63 కానిస్టేబుల్ పోస్టులకు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలోని 1601 పరీక్షా కేంద్రాల్లో 6,03,955మంది అభ్యర్ధులు పరీక్షలు రాశారు. అయితే పరీక్షకు మాత్రం 6,61,196మంది ధరఖాస్తు చేసుకున్నారు.ఎస్ఐ,కానిస్టేబుల్ రాత పరీక్షల్లో కటాఫ్ మార్కులను ప్రభుత్వం సవరించింది. ఎస్సీ,ఎస్టీలకు 40 మార్కులను కటాఫ్ గా నిర్ణయించింది. బీసీలకు 50 ,60 మార్కులను ఓసీలకు కటాఫ్ గా నిర్ణయించింది.
ప్రశ్నాపత్రంలో తపపులపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు గతంలోనే ప్రకటించింది. అయితే ఈ విషయమై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అభ్యర్ధులు గుర్తు చేస్తున్నారు.
also read:తెలంగాణ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలు: ఓయూలో ఆందోళన
తప్పుడు ప్రశ్నలకు గాను మార్కులను కలిపితే మరికొందరు కానిస్టేబుల్,ఎస్ఐ పరీక్షలకు క్వాలిఫై అవుతారని నిరసనకారులు గుర్తు చేస్తున్నారు.ఈ విషయమై తమకు న్యాయం చేయాలని కోరుతూ గత నెల 26న ఓయూలో కానిస్టేబుల్ పరీక్షలు రాసిన అభ్యర్ధులు ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే.