పరీక్షలు నిర్వహించకుండా గ్రేడింగ్ ఇవ్వొచ్చా: టెన్త్ పరీక్షలపై తెలంగాణహైకోర్టు
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులను కూడ రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
హైదరాబాద్: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులను కూడ రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ హైకోర్టులో ఇవాళ హైకోర్టు విచారించింది. సప్లిమెంటరీ పరీక్షలు రాసే విద్యార్థులను కూడ రెగ్యులర్ విద్యార్థులుగా పరిగణించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు హైకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం శనివారం నాడు నివేదించింది.
also read:ప్రైవేట్ స్కూల్స్ హాస్టల్స్‌కు అనుమతి: టెన్త్ పరీక్షలపై హైకోర్టుకు తెలంగాణ సర్కార్
పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం మొగ్గు చూపింది. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేశామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
ఈ నెల 8వ తేదీ నుండి జూలై 5వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది.
పరీక్షలు నిర్వహించకుండానే గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఉందా అని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
హైద్రాబాద్ ,రంగారెడ్డి జిల్లాలు కాకుండా రాష్ట్రం మొత్తం పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందా అనే విషయాన్ని కూడ కోర్టు ప్రభుత్వాన్ని అడిగింది.ప్రభుత్వాన్ని అడిగి సమాధానం చెబుతామని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. అయితే ఈ కేసు విచారణను ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు కోర్టు వాయిదా వేసింది. ప్రభుత్వం చెప్పే సమాధానం ఆధారంగా హైకోర్టు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.