తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ ఆపాలని హైకోర్టు స్పష్టం చెయ్యలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా విడుదల కాకుండా షెడ్యూల ప్రకటించడం ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని తెలిపారు. తెలంగాణలో తక్షణమే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ ఆపాలని హైకోర్టు స్పష్టం చెయ్యలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా విడుదల కాకుండా షెడ్యూల ప్రకటించడం ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుందని తెలిపారు. తెలంగాణలో తక్షణమే ఎన్నికల నిబంధనలు అమలులోకి వస్తాయని తెలిపారు.
ప్రభుత్వ భవనాలపై ఉన్న కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు 24 గంటల్లోగా తొలగించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో 48 గంటల్లోగా తీసేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రతి జిల్లాలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అధికారిక వాహనాల వినియోగం తక్షణమే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వ ప్రకటనలు నిలిపి వెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రచారం నిషేధమన్న ఆయన ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్, మొబైల్ టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపనున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితాపై హైకోర్టు ఏ ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామని రజత్ కుమార్ తెలిపారు.
అలాగే నగదు, మద్యం సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్త ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని కొట్టిపారేశారు. నామినేషన్ల గడువుకు ముందు పదిరోజుల వరకు ఓటు నమోదుకు అవకాశం కల్పిస్తామని పెండింగ్ ఓటర్ కార్డులను వెంటనే అందిస్తామని స్పష్టం చేశారు.
