Asianet News TeluguAsianet News Telugu

అర్థరాత్రి కారు బీభత్సం.. నీరు చిమ్మించి, సారీ చెప్పలేదన్నందుకు.. టూవీలర్లను ఢీకొట్టించడంతో.. మహిళ మృతి..

బెంజ్ కారులో వెడుతున్న ఓ వ్యక్తి.. అర్థరాత్రి రోడ్డు మీద వెడుతున్న ఇద్దరు వ్యక్తుల మీద నీటిని చిమ్మించాడు. ఎందుకలా చేశావని అడిగినందుకు వారి బైక్ లను గట్టిగా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. 

businessman rams two wheelers  after argument, woman died in hyderabad
Author
First Published Dec 22, 2022, 6:50 AM IST

హైదరాబాద్ : కారులో వెళ్తున్న వ్యక్తి ద్విచక్ర వాహనాలను వేగంగా ఢీకొట్టడంతో.. జరిగిన ప్రమాదంలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. రోడ్డుపై ఉన్న నీటిలోనుంచి కారును వేగంగా నడుపుతూ పక్కనున్న వాహనదారుల మీదికి నీటిని చిమ్మిస్తుండడంతో.. అలా ఎందుకు చేస్తున్నావ్ అంటూ అడిగినందుకు.. కారులో ఉన్న వ్యక్తి చేసిన దారుణం ఇది. తనని అడుగుతారా అంటూ కోపంతో కారును వేగంగా రెండు టూ వీలర్ లకు ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన ఓ మహిళ మరణించింది. హైదరాబాదులోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ హాస్పిటల్ దగ్గర్లో  ఈ ప్రమాదం జరిగింది. దీనిమీద రాయదుర్గం ఇన్స్పెక్టర్ ఏం మహేష్ ఈ విధంగా వివరాలు తెలిపారు…

ప్రమాదంలో మరణించిన  వ్యక్తి పేరు మారియా మీర్ (25).  ఆమె తన భర్త సయ్యద్ సైఫుద్దీన్ తో కలిసి డిసెంబర్ 18వ తేదీ అర్ధరాత్రి ఒకటిన్నర సమయంలో బండిమీద వెడుతోంది. వీరితో పాటు. సయ్యద్ సైఫుద్దీన్ కు సోదరుడు వరసయ్యే సయ్యద్ మీరాజుద్దీన్ (24), రాషెద్ మాషా ఉద్దీన్ (19)లు మరో టూవీలర్ మీద  అ వస్తున్నారు. వీరు ఎర్రగడ్డలో ఉంటారు.  అక్కడినుంచి  మాదాపూర్ హాంగింగ్ బ్రిడ్జ్  మీది నుంచి గచ్చిబౌలికి వెళుతున్నారు. ఏఐజీ దగ్గర్లో కి వచ్చిన సమయంలో..  ఓ వ్యక్తి బెంజ్ కార్ లో వెడుతూ రోడ్డుపై ఉన్న నీటి గుంటలో నుంచి వేగంగా దూసుకెళ్ళాడు. దీంతో సైఫుద్దీన్ అతని సోదరుడు వెడుతున్న టూవీలర్ ల మీద ఆ నీళ్లు పడి, తడిచి పోయారు.

హైదరాబాద్‌ చేరుకున్న దిగ్విజయ్ సింగ్.. తాజ్‌ కృష్ణలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో భేటీ

దీంతో వారు కారు డ్రైవర్ ను వెంబడించి అలా ఎందుకు నీళ్లు పడేశారు అంటూ ప్రశ్నించారు. కారులో ఉన్నది జూబ్లీహిల్స్ కు చెందిన రాజ సింహారెడ్డి(26) అనే వ్యాపారి. సోదరులు అతడిని ఆపి కనీసం క్షమాపణలు కూడా  చెప్పలేదు అని అడిగారు. ఈ క్రమంలో వారి మధ్య మాటల యుద్ధం జరిగింది. కోపానికి వచ్చిన రాజ సింహారెడ్డి  తన బెంజ్ కారుతో వారి టూవీలర్ లను  గుద్దాడు. వారు కిందపడిపోయారు. కారును వేగంగా పోనిచ్చాడు. మారియా, సైఫుద్దీన్ లు తేరుకుని బండిని వెంబడించి.. అడిగినందుకు కారుతో ఢీ కొట్టారు ఎందుకు అని మళ్లీ ప్రశ్నించారు. 

దీంతో మరింత కోపానికి వచ్చిన రాజా సింహారెడ్డి.. కారుతో మళ్ళీ గట్టిగా మారియా, సైఫుద్దీన్ ల టూవీలర్ ను ఢీ కొట్టాడు.ఈ దాడికి  వారి బండి ఎగిరి కొద్ది దూరంలో పడిపోయింది. పడడంతో మారియా తీవ్రంగా గాయపడింది. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మారియా బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. దీని మీద కేసు నమోదు కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అనుకోని ప్రమాదంలో మృతిచెందిన మరియాకు 8 నెలల చిన్న పాప ఉన్నట్లు సమాచారం..

Follow Us:
Download App:
  • android
  • ios