Asianet News Telugu

వ్యాపారవేత్త కిడ్నాప్... సినిమా స్టైల్లో పోలీస్ చేజింగ్, కిడ్నాపర్ల అరెస్ట్

హైదారాబాద్ కు చెందిన ఒక వ్యాపారవేత్తను ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. 

business man kidnapped in hyderabad
Author
Kodimial, First Published Oct 6, 2020, 12:03 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

కరీంనగర్: హైదరాబాద్ లో కిడ్నాప్ కు గురయిన ఓ వ్యాపారవేత్తను కాపాడేందుకు సినీ పక్కీలో కారును చేజింగ్ చేశారు పోలీసులు.  కిడ్నాపర్లు కూడా పోలీసులకు చిక్కకుండా కారును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. దీంతో వారిని చేజింగ్ చేసిమరీ పట్టుకుని వ్యాపారవేత్తను కాపాడారు పోలీసులు. ఈ చేజింగ్ ను చూసి అసలేం జరుగుతుందో తెలియక ప్రజలు ఆందోళనకు గురయ్యారు. 

 హైదారాబాద్ కు చెందిన ఒక వ్యాపారవేత్తను ఐదుగురు దుండగులు కిడ్నాప్ చేశారు. అతన్ని కారులో తీసుకుని వెళుతుండగా దొంగలమర్రి వద్ద తనీఖీ జరుగుతుండటంతో పోలీసులకు చిక్కకుండా కారును వేగంగా పోనిచ్చారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ వాహనంలో ఆ కారును చేజ్ చేశారు.

ఈ క్రమంలోనే కొడిమ్యాల శివారులో కారు ఆగడంతోనే ఇద్దరు కిడ్నాపర్లు పరారయ్యారు. మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారవేత్తను క్షేమంగా కాపాడటంతో పాటు కారును స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. 

సంఘటన స్థలాన్ని డిఎస్పి వెంకటరమణ, సిఐ కిశోర్ పరిశీలించారు. ఈ ఘటనలో పొలీసులు ఎప్పటినుండో వెతుకుతున్న పాత నేరస్తులు పట్టు బడినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు జరిగిన కిడ్నాప్ కు కూడా ఆర్థిక లావాదేవీలే కారణమని అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios