హైదరాబాద్ బస్సుకు తప్పిన ప్రమాదం
మంచుకొండల మధ్య సేదతీరున్న బస్సేమీ కాదు ఇది.. క్షణం ఆలస్యమైతే ఈ ప్రగతి రథచక్రం మూసీ మురుగుకు బలైపోయేదే .. అయితే డ్రైవర్ చాకచక్యంగా బస్సును ఆపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఇదెక్కడో జరిగిన సంఘటన కాదు.. అంతర్జాతీయ నగరంగా మారుతున్న హైదరాబాద్ నగరంలోనే చోటుచేసుకుంది.
పటాన్ చెరువు పారిశ్రామిక వాడల నుంచి వస్తున్న విషరసాయనాల వల్ల మూసీ ఎంత కలుషితమవుతుందో ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు.
ముఖ్యంగా ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో ఆ విషరసాయనాల కలయికతో మూసీ నది తెల్లటి నురుగుతో విషాన్ని వెదజిమ్ముతోంది.
పోచంపల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సు కృష్ణ నదిలో మూసీ కలిసే మక్తా ప్రాంతంలో ఓ కల్వర్టు వద్ద ప్రమాదానికి లోనైంది. ఆకస్మాత్తుగా మూసీ నురుగు బస్సుపైకి రావడంతో డ్రైవర్ అప్రమత్తమయ్యారు. వెంటనే బస్సును అక్కడే ఆపేశారు. స్థానికులు వెంటనే స్పందించి బస్సులో ఉన్న25 మంది ప్రయాణికులను రక్షించారు.
