ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదం: దగ్ధమైన బోగీలు బీబీనగర్ కు తరలింపు
అగ్ని ప్రమాదానికి గురైన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలుకు చెందిన ఆరు బోగీలను అధికారులు బీబీనగర్ కు తరలించారు.
హైదరాబాద్: అగ్ని ప్రమాదానికి గురైన ఫలక్ నుమాకు చెందిన ఆరు బోగీలను బీబీనగర్ కు తరలించారు రైల్వే అధికారులు.ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు శుక్రవారంనాడు భువనగిరి రైల్వే స్టేషన్ కు సమీపంలోని పగిడిపల్లి వద్దకు చేరుకునేసరికి రైలులో అగ్ని ప్రమాదం చేరుకుంది. ఈ ప్రమాదంలో ఆరు బోగీలు దగ్ధమయ్యాయి. వీటిలో ఐదు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్క బోగి పాక్షికంగా దగ్దమైంది. ఎస్ 2, ఎస్ 3, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6, ఎస్ 7 బోగీలు దగ్ధమయ్యాయి.
దగ్ధమైన బోగీలను సంఘటన స్థలం వద్దే వదిలేసి ఇతర బోగీలతో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. దగ్దమైన రైలు బోగీలను అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. రైలు బోగీలను చల్లబరిచిన తర్వాత బీబీనగర్ రైల్వే జంక్షన్ కు తరలించారు.
also read:ఫైర్ సేఫ్టీ పరికరాలతో వెళ్లే సరికి మంటల వ్యాప్తి: లోకో పైలెట్
ఈ రైల్వే ట్రాక్ పై ఈ రైలు బోగీలను తరలించిన తర్వాత ఈ మార్గంలో విద్యుత్ ను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటారు. విద్యుత్ ను పునరుద్దరించే వరకు ఈ ట్రాక్ లో డీజీల్ ఇంజన్ రైళ్లను నడపనున్నారు.
ఇదిలా ఉంటే ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణను ప్రారంభించారు. మరో వైపు విజయనగరం జిల్లాకు చెందిన ప్రయాణీకుడు తాము ఉన్న బోగీలో మంటలను గుర్తించి చైన్ ను లాగాడు. దీంతో రైలు నిలిచిపోయింది. ట్రైన్ అలాగే ముందుకు సాగితే ఇతర బోగీలకు మంటలు వ్యాపించేవి. అదే జరిగితే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఐదు బోగీలు దగ్ధమైనా కూడ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంపై అంతా ఊపిరి పీల్చుకున్నారు.ఈ ఆరు బోగీల్లోని ప్రయాణీకులను ప్రత్యేక రైలుతో పాటు ఆర్టీసీ బస్సుల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు తరలించారు అధికారులు.