భువనగిరి: యాదాద్రి-భువనగిరి జిల్లాలోని పెద్ద కందుకూరులో సోమవారం నాడు జరిగిన బారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలింది.  

యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో సోమవారం నాడు సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. పేలుడుధాటికి ఫ్యాక్టరీ భవనం కుప్పకూలింది.

ఈ ఘటన జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది.ఏడాది కాలంలో ఈ ఘటన మూడోదిగా స్థానికులు చెబుతున్నారు. ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో  తరచూ ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి.