Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. 25 మందితో బీఎస్పీ మూడో జాబితా, మహేశ్వరం నుంచి కొత్త మనోహర్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి శనివారం బీఎస్పీ మూడో జాబితాను విడుదల చేసింది. 25 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. కాంగ్రెస్‌లో కీలక నేతగా వున్న కొత్త మనోహర్ రెడ్డి.. ఇటీవల బీఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు మహేశ్వరం టికెట్‌ను పార్టీ కేటాయించింది. 

bsp releases third list with 25 members for telangana assembly elections ksp
Author
First Published Nov 4, 2023, 8:06 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఎస్పీ కూడా తీవ్రంగానే కృషి చేస్తోంది. మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు చేపట్టి.. ప్రజల్లోకి వెళ్తోంది. తాజాగా శనివారం బీఎస్పీ మూడో జాబితాను విడుదల చేసింది. 25 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. దీంతో కలిపి మొత్తంగా మూడు విడతల్లో కలిపి 87 మందిని ప్రకటించినట్లయ్యింది. ఇందులో 32 మంది ఎస్సీలకు, 33 మంది బీసీలకు, 13 మంది ఎస్టీలకు, నలుగురు జనరల్, ఐదుగురు మైనార్టీలకు సీట్లను కేటాయించింది. ఇకపోతే.. కాంగ్రెస్‌లో కీలక నేతగా వున్న కొత్త మనోహర్ రెడ్డి.. ఇటీవల బీఎస్పీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు మహేశ్వరం టికెట్‌ను పార్టీ కేటాయించింది. 

బీఎస్పీ మూడో జాబితా .. అభ్యర్ధుల వీరే :

 1. మహేశ్వరం - కొత్త మనోహర్ రెడ్డి
 2. చెన్నూర్ (ఎస్సీ) - డాక్టర్ దాసారపు శ్రీనివాస్
 3. అదిలాబాద్ - ఉయక ఇందిర
 4. ఆర్మూర్ - గండిగోట రాజన్న
 5. నిజామాబాద్ రూరల్ - మటమాల శంకర్
 6. బాల్కొండ - పల్లికొండ నర్సయ్య
 7. కరీంనగర్ - నల్లాల శ్రీనివాస్
 8. హుస్నాబాద్ - పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్
 9. నర్సాపూర్ - కుతాడి నర్సింహులు
 10. సంగారెడ్డి - పల్పనూరి శేఖర్
 11. మేడ్చల్ - మల్లెపోగు విజయరాజు
 12. కుత్బుల్లాపూర్ - మహ్మద్ లమ్రా అహ్మద్
 13. ఎల్బీ నగర్ - గవ్వసాయి రామకృష్ణ ముదిరాజు
 14. రాజేంద్రనగర్ - రాచమల్లు జయసింహ (రివైజ్డ్)
 15. అంబర్ పేట - ప్రొ.అన్వర్ ఖాన్ (రివైజ్డ్)
 16. కార్వాన్ - ఆలేపు అంజయ్య
 17. గోషామహల్ - మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్
 18. నారాయణపేట - బొడిగెల శ్రీనివాస్
 19. జడ్చర్ల - శివ పుల్కుందఖర్
 20. అలంపూర్(ఎస్సీ) - మాకుల చెన్నకేశవరావు
 21. పరకాల - ఆముదాలపల్లి నరేశ్ గౌడ్
 22. భూపాలపల్లి - గజ్జి జితేందర్ యాదవ్
 23. ఖమ్మం - అయితగాని శ్రీనివాస గౌడ్
 24. సత్తుపల్లి(ఎస్సీ) - నీలం వెంకటేశ్వరరావు
 25. నారాయణఖేడ్ - మహ్మద్ అలావుద్దీన్ పటేల్
Follow Us:
Download App:
 • android
 • ios