తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ).. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ముమ్మరం చేశాయి. తాజాగా బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ).. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. 20 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఎస్పీ అభ్యర్థులను ఖరారు చేస్తూ జాబితాను విడుదల చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించినట్టుగా బీఎస్పీ తెలిపింది.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ప్రవీణ్ పేరు తొలి జాబితా అభ్యర్థులలో ఉంది. ఆయన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ శాసనసభ స్థానం నుంచి బరిలో నిలవనున్నారు. ఇక, బీఎస్పీ విడుదల చేసిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే..
1. సిర్పూర్ (జనరల్)- ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
2. జహీరాబాద్ (ఎస్సీ)- జంగం గోపి
3. పెద్దపల్లి (జనరల్) - దాసరి ఉష
4. తాండూరు (జనరల్)- చంద్రశేఖర్ ముదిరాజ్
5. దేవరకొండ (ఎస్టీ)- ఎం వెంకటేశ్ చౌహాన్
6. చొప్పదండి (ఎస్సీ)- కొంకటి శేఖర్
7. పాలేరు (జనరల్)- అల్లిక వెంకటేశ్వర్ రావు
8. నకిరేకల్ (ఎస్సీ)- మేడి ప్రియదర్శిని
9. వైరా (ఎస్టీ)- బానోతు రాంబాబు నాయక్
10. ధర్మపురి (ఎస్సీ)- నక్క విజయ్ కుమార్
11. వనపత్తి (జనరల్)- నాగమొని చెన్న రాములు ముదిరాజ్
12. మానుకొండూరు (ఎస్సీ)- నిషాని రాంచందర్
13. కోదాడ (జనరల్)- పిలుట్ల శ్రీనివాస్
14. నాగర్‌కర్నూల్ (జనరల్)- కొత్తపల్లి కుమార్
15. ఖానాపూర్ (ఎస్టీ)- బాన్సిలాల్ రాథోడ్
16. అందోల్ (ఎస్సీ)- ముప్పరపు ప్రకాశం
17. సూర్యాపేట (జనరల్)- వట్టే జానయ్య యాదవ్
18. వికారాబాద్ (ఎస్సీ)- గడ్డం క్రాంతి కుమార్
19. కొత్తగూడెం (జనరల్)- ఎర్ర కామేష్
20. జుక్కల్ (ఎస్సీ)- ప్రధ్య్న కుమార్ మాధవరావ్
