Asianet News TeluguAsianet News Telugu

బీఎస్పీ రెండో జాబితా విడుదల.. ట్రాన్స్‌జెండర్‌కు టికెట్.. కేసీఆర్ పై ఎవరు పోటీ చేస్తున్నారంటే?

బీఎస్పీ ఈ రోజు అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. 43 మంది అభ్యర్థులతో విడుదల చేసిన ఈ జాబితాలో కొన్ని కీలక నిర్ణయాలను బీఎస్పీ తీసుకుంది. వరంగల్ ఈస్ట్ నుంచి ట్రాన్స్‌జెండర్‌ను బరిలోకి దించే నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
 

bsp released candidates second list, transgender from warangal east kms
Author
First Published Oct 30, 2023, 7:23 PM IST

హైదరాబాద్: బహుజన సమాజ్ పార్టీ రెండో జాబితాను ఈ రోజు విడుదల చేసింది. లక్డీకపూల్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించారు. 43 మందితో ఈ రెండో జాబితాను ఆయన వెల్లడించారు. ఇది వరకే 20 మంది అభ్యర్థులతో బీఎస్పీ తొలి జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం 63 స్థానాలకు బీఎస్పీ అభ్యర్థులను ఖరారు చేసింది. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

రెండో జాబితాలో కొన్ని నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి. వరంగల్ ఈస్ట్ స్థానంలో పుష్పిత లయ అనే ట్రాన్స్‌జెండర్‌ను బీఎస్పీ బరిలోకి దింపింది. దీంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న తొలి ట్రాన్స్‌జెండర్ అభ్యర్థిగా పుష్పిత లయ రికార్డుల్లోకి ఎక్కబోతున్నారు. కాగా, 43 మంది అభ్యర్థుల్లో 26 మంది బీసీలు, ఏడుగురు ఎస్టీలు, ఆరుగురు ఎస్సీలు, ముగ్గురు ఓసీలు, ఇద్దరు మైనార్టీలు ఉన్నారు.

Also Read: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కోదండరామ్ పార్టీ టీజేఎస్ మద్దతు.. హస్తం ముందు 6 షరతులు

బీఎస్పీ ప్రకటించిన రెండో జాబితాలో  కామారెడ్డి స్థానంలోనూ అభ్యర్థిని ఖరారు చేశారు. కామారెడ్డి నుంచి బీఎస్పీ టికెట్ పై ఉడతావర్ సురేశ్ గౌడ్ బరిలో నిలుస్తున్నారు. ఈ స్థానంలో సీఎం కేసీఆర్ కూడా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

బీఎస్పీ ప్రకటించిన రెండో జాబితా ఇలా ఉన్నది.

1. బెల్లంపల్లి - జాడీ నర్సయ్య
2.ఆసిఫాబాద్ - కనక ప్రభాకర్
3. కోరుట్ల - నిశాత్ కార్తికేయ్ గౌడ్
4.మంచిర్యాల - తోట శ్రీనివాస్
5. బోథ్ - మోస్రాం జంగుబాపు
6. కామారెడ్డి - ఉడతావర్ సురేశ్ గౌడ్
7.రామగుండం - అంబటి నరేశ్ యాదవ్
8. జగిత్యాల - బల్కం మల్లేశ్ యాదవ్
9. సిరిసిల్ల - పిట్టల భూమేశ్ ముదిరాజ్
10. వేములవాడ - గోలి మోహన్
11. హుజురాబాద్ - పల్లె ప్రశాంత్ గౌడ్
12. దుబ్బాక - సల్కం మల్లేశ్ యాదవ్
13. మహబూబ్ నగర్ - బోయ స్వప్న శ్రీనివాసులు
14.కొడంగల్ - కురువ నర్మద కిష్టప్ప
15. దేవరకద్ర - బసిరెడ్డి సంతోష్ రెడ్డి
16. అచ్చంపేట - మోత్కూరి నాగార్జున
17. మక్తల్ - వర్కటన్ జగన్నాథ్ రెడ్డి
18.కల్వకుర్తి - కొమ్ము శ్రీనివాస్ యాదవ్
19. కొల్లాపూర్ - గగనం శేఖరయ్య
20. షాద్ నగర్ - పసుపుల ప్రశాంత్ ముదిరాజ్
21. డోర్నల్ - గుగులోత్ పార్వతీ నాయక్
22.వర్ధన్నపేట - డాక్టర్ వడ్డేపల్లి విజయ్ కుమార్
23. నర్సంపేట - డాక్టర్ గుండాల మధన్ కుమార్
24. స్టేషన్ ఘన్ పూర్ - తాళ్లపల్లి వెంకటస్వామి
25. పాలకుర్తి - సింగారం రవీంద్రగుప్త
26. మహబూబాబాద్ -  గుగులోత్ శంకర్ నాయక్
27. వరంగల్ ఈస్ట్ - చిత్రపు పుష్పత లయ
28. మునుగోడు - అందోజు శంకరాచారి
29. హుజూర్ నగర్ - రాపోలు నవీన్
30. ములుగు - భూక్యా జంపన్న నాయక్
31. భద్రాచలం - ఇర్పా రవి
32. పినపాక - వజ్జ శ్యామ్
33. అశ్వారావుపేట -  మడకం ప్రసాద్
34. మధిర - చెరుకుపల్లి శారద
35. చేవెళ్ల - తొండుపల్లి రాజా అలియాస్ రాజమహేంద్రవర్మ
36. పరిగి - యంకెపల్లి ఆనంద్
37. రాజేందర్ నగర్ - ప్రొ. అన్వర్ ఖాన్
38. ఉప్పల్ - సుంకర నరేశ్
39. మలక్ పేట  - అల్లగోల రమేశ్
40. చాంద్రయాణగుట్ట - మూల రామ్ చరణ్ దాస్
41. నాంపల్లి - మౌలానా షఫీ మసూదీ
42. ఇబ్రహీంపట్నం - మల్లేశ్ యాదవ్
43. శేరిలింగంపల్లి - ఒంగూరి శ్రీనివాస్ యాదవ్

Follow Us:
Download App:
  • android
  • ios