షాకింగ్... కొడంగల్ లో పదేళ్ల బాలుడి దారుణ హత్య : బలి ఇచ్చారనే అనుమానాలు

ఓ పదేళ్ల బాలుడిని నరబలి ఇచ్చారనే అనుమానాలు వికారాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. కనిపించకుండా పోయిన ఆ బాలుడు సూట్ కేసులో శవమై.. దారుణమైన స్థితిలో దొరికాడు.

Brutal murder of a ten-year-old boy in Kodangal : Suspects that he was sacrificed

వికారాబాద్ : తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. పదేళ్ల బాలుడిని దారుణంగా హత్య చేసి శవాన్ని సూట్ కేసులో పెట్టి ముళ్ల పొదల్లో పడేశారు. ఇందుకు సంబంధించి పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. 

పదేళ్ల బాలుడు రజాఖాన్ శనివారం నుంచి కనిపించకుండా పోయాడు. దీంతో కుటుంబ సభ్యులు తమకు తెలిసినవారి ఇళ్లల్లో వెతకడం ప్రారంభించారు. ఎక్కడా దొరకకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆదివారం సాయంత్రం ముళ్లపొదల్లో పడి ఉన్న సూట్ కేసు అనుమానాస్పదంగా కనిపించడంతో.. దాన్ని  తెరిచి చూడగా.. బాలుడి శవం బయటపడింది. 

గుప్త నిధుల కోసం బాలుడిని నిందితులు బలి ఇచ్చి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులు గంజాయికి బానిసలుగా మారి, ఒళ్లు తెలియని స్థితిలో బాలుడిని హత్య చేసి ఉండవచ్చునని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బాలుడి హత్యతో కొడంగల్ పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలో పోలీసు బందోబస్తు పెంచారు. వికారాబాద్ నుంచి కూడా పోలీసు బలగాలు చేరుకున్నాయి.

ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి

ఇలాంటి ఘటనే తాజాగా హర్యానాలో వెలుగులోకి వచ్చింది. జనాలకు యూ ట్యూబ్ పిచ్చి ముదిరిపోతోంది. వంటల దగ్గరినుంచి అణుబాంబు తయారీ వరకు... ఏది చేయాలన్నా యూట్యూబ్ వీడియోలు చూస్తే చాటు.. పరిజ్ఞానం ఉచితంగా అందుబాటులో దొరుకుతుంది. దీంతో అక్రమాలకు పాల్పడుతున్నవారు. దొంగతనాలు చేస్తున్నవారు.. ఏకంగా బాంబులు తయారు చేస్తున్న వారూ అక్కడక్కడా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కోవలో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

యూట్యూబ్ వీడియోలు చూసి చేతబడి నేర్చుకోవడానికి ఓ ఏడేళ్ల చిన్నారిని హత్య చేశాడో దుర్మార్గుడు. వివరాల్లోకి వెడితే.. హరియాణా పానీపత్ లో ఏడేళ్ల చిన్నారి హత్యాచారం కేసులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. నిందితుడు యోగేశ్.. ఓ బాలికను నరబలి ఇచ్చిన విషయం మీద కీలక వివరాలు రాబట్టారు పోలీసులు. అమ్మాయిలను లొంగదీసుకోవడానికి యోగేశ్ చేతబడి నేర్చుకుంటున్నాడని పోలీసులు వెల్లడించారు. యూట్యూబ్ లో వీడియోలు చూసేవాడని, చేతబడిలో ప్రావీణ్యం సంపాదించడానికి బాలికను చంపాలని ప్రణాళిక రచించాడని పేర్కొన్నారు. అందుకే ఏడేళ్ల చిన్నారిని టార్గెట్ చేసిన యోగేశ్.. దీపావళి రోజున ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారిని హత్యాచారం చేసి కవర్ లో చుట్టి ఆమె ఇంటి పెరట్లో పడేశాడు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios