నల్లగొండ జిల్లలో దారుణం జరిగింది. పట్టణంలోని రాంనగర్ లో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్య కలకలం రేపింది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులను దుండగులు బండరాళ్లతో కొట్టి చంపారు. స్థానికుల సమాచారంతో టూ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. 

ఘటనపై విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు ఇతర రాష్ట్రానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారు ఏ రాష్ట్రం వారు అనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటన పట్టణంలో సంచలనం రేకెత్తించింది. 

మద్యం మత్తులో హత్యలు జరిగాయా, వారికేమైన పాత కక్షలు ఉన్నాయా? అసలు హతులెవరు? ఎందుకు చంపారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.