హైదరాబాద్ లింగంపల్లిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఓల్డ్ ఎంఐజీలో నివసించే రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. అతని ఇంట్లోనే బండరాయితో తలపై మోడీ రాజశేఖర్‌ను దారుణంగా హత్య చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంగళవారం రాత్రే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.