KTR: బీఆర్ఎస్ నెక్స్ట్ టార్గెట్.. పార్లమెంటు ఎన్నికల కోసం సిద్ధమవ్వండి: కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణుల్లో భరోసా నింపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమికి కుంగిపోవద్దని, లోక్ సభ ఎన్నికల పై ఫోకస్ పెట్టాలని కేటీఆర్ అన్నారు.
 

brs working president k tharaka ramarao calls party workers to get ready to fight lok sabha elections kms

KTR: బీఆర్ఎస్ పార్టీకి నెక్స్ట్ టార్గెట్ ఫిక్స్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం నుంచి బయటకు రావాలని, అపజయానికి కుంగిపోవద్దని పార్టీ శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు ఇచ్చారు. తదుపరి లక్ష్యం పై దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. లోక్ సభ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని చెప్పారు. కాబట్టి, అందుకు సంసిద్ధం కావాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చెప్పారు.

లోక్ సభ ఎన్నికల కోసం సమాయత్తవం కావాలని, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్.. పార్టీ శ్రేణులకు సూచించారు. మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కారణాలను సమీక్షిస్తూ.. విశ్లేషిస్తూ.. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత కోసం చర్చలు చేశారు.

పరాజయం పొందిన బీఆర్ఎస్ అభ్యర్థులే ఆయా నియోజకవర్గ ఇంచార్జులుగా ఉండాలని, నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేయాలని, ప్రజలతో కలిసి ఉండాలని కేటీఆర్ చెప్పారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి పార్టీ సమీక్షా సమావేశాలు జరుగుతాయని, వీటిని 26వ తేదీల్లోగా ముగించుకోవాలని తెలిపారు.

Also Read: 6 గ్యారెంటీలకు దరఖాస్తులు సరే.. మరి కొత్త రేషన్ కార్డులేవి - ప్రభుత్వానికి బండి సంజయ్ సూటి ప్రశ్న..

ప్రత్యేక తెలంగాణ సిద్ధించిన తర్వాత మొన్నటి వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సుమారు తొమ్మిదన్నేర పాలన తర్వాత ప్రతిపక్ష సీట్లో కూర్చుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. తొలి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ సర్కారు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య వాడి వేడి మాటలు చూశాం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios