Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ దే అధికారం: మిర్యాలగూడలో మంత్రి హరీష్ రావు

మిర్యాలగూడలో  జరిగిన బీఆర్ఎస్  ఆత్మీయ సమ్మేళనంలో  మంత్రి హరీష్ రావు  పాల్గొన్నారు. విపక్షాలపై  ఆయన  ఈ సందర్భంగా  విమర్శలు గుప్పించారు. 

 BRS  will  retain  Power  Third Time  In Telangana : Minister   Harish Rao  lns
Author
First Published May 26, 2023, 2:15 PM IST

మిర్యాలగూడ: రానున్న  ఎన్నికల్లో  తెలంగాణలో  మూడోసారి  బీఆర్ఎస్ అధికారంలోకి రానుందని  మంత్రి హరీష్ రావు  ధీమాను వ్యక్తం  చేశారు.శుక్రవారంనాడు  మిర్యాలగూడలో  బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం  నిర్వహించారు.  ఈ సమ్మేళనంలో  మంత్రి హరీష్ రావు   ప్రసంగించారు. 

వివిధ  రంగాల్లో   తెలంగాణ అత్యుత్తమ  ప్రతిభ కనబర్చినందుకే   రాష్ట్రం అగ్రస్థానంలో  నిలిచిందన్నారు. ఇందుకు కేంద్రం ఇచ్చిన అవార్డులే నిదర్శనంగా  మంత్రి హరీస్ రావు  పేర్కొన్నారు. పంచాయతీల్లో 38 శాతం  అవార్డులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు.  మిషన్ భగీరథ, అటవీ అభివృద్ధి, విద్యుత్ శాఖ, వైద్య శాఖకు అవార్డులు వచ్చాయన్నారు.ఐటీ రంగంలో  తెలంగాణ  రాష్ట్రం దేశంలోనే  నెంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.50 ఏళ్లుగా  జరగని అభివృద్దిని  కేసీఆర్  చేశాడని  మంత్రి హరీష్ రావు  గుర్తు  చేశారు.. మూడోసోరి  కూడా తెలంగాణలో  కేసీఆర్ సర్కార్ రానుందని  ఆయన  ధీమాను వ్యక్తం  చేశారు 

తెలంగాణలో  జరిగిన  అభివృద్దిపై  విపక్షాలు దుష్ప్ర చారం చేస్తున్నాయని మంత్రి హరీష్ రావు  మండిపడ్డారు.ఈ విషయమై  బీఆర్ఎస్ క్యాడర్  అప్రమత్తంగా  ఉండాలని  ఆయన  కోరారు.  ఈ ఐదేళ్లలో  లక్షా 50 వేల  ఉద్యోగాలు  ఇచ్చిన విషయాన్ని మంత్రి హరీష్ రావు  గుర్తు  చేశారు.రాష్ట్రంలో  గతంలో   ప్రభుత్వాసుపత్రుల్లో  15 వేల పడకలుండేవన్నారు. కానీ  ప్రస్తుతం  వీటి సంఖ్యను  50 వేలకు  పెంచినట్టుగా  మంత్రి  చెప్పారు.

ఈ విద్యా  సంవత్సరంలో  9 మెడికల్ కాలేజీలను   ప్రారంభిస్తామన్నారు.  రానున్న ఎన్నికల్లో  విజయం సాధిస్తామని  కాంగ్రెస్ నేతలు  కలలు కంటున్నారని  మంత్రి హరీష్ రావు  చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో  ఏం జరిగిందని  ఆయన  ప్రశ్నించారు. మునుగోడులో  కాంగ్రెస్ కు  డిపాజిట్  దక్కిందా అని  హరీష్ రావు  ప్రశ్నించారు. 

తెలంగాణలో కాదు, కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉందని  ఆయన  ఎద్దేవా  చేశారు.  హిమాచల్  ప్రదేశ్ సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడారన్నారు. వాస్తవాలు తెలుసుకోవాలని  ఆయన  సూచించారు.  హిమాచల్ ప్రదేశ్ నుండి ఎంతో మంది ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు తెలంగాణ  నుండి  నేర్చుకోవాలని  ఆయన హిమాచల్ ప్రదేశ్  సీఎం కు  సూచించారు. 

రాష్ట్రంలో నిరుద్యోగాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు.  విద్యార్థుల‌ను మ‌భ్య‌పెట్టేందుకు, రాజ‌కీయ అవ‌స‌రాల కోసం మాత్ర‌మే ఉమ్మడి ఏపీలో  ఎపీపీఎస్సీ ద్వారా నోటిఫికేష‌న్లు ఇచ్చే వారన్నారు.   2004 నుంచి 2014 వ‌ర‌కు ఉమ్మ‌డి ఏపీలో ఏపీపీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య కేవ‌లం 24,086 అని  హరీష్ రావు గుర్తు  చేశారు. ఇందులో తెలంగాణ బిడ్డ‌ల‌కు క‌నీసం 6వేల ఉద్యోగాలు కూడా ద‌క్క‌లేదన్నారు.రాష్ట్రంలోని  40 నుండి  50  అసెంబ్లీ సీట్లలో  కాంగ్రెస్ కు అభ్యర్ధులే లేరని హరీష్ రావు  చెప్పారు.అభ్యర్ధులే లేని  పార్టీ  ఎలా ధికారంలోకి వస్తుందని  ఆయన  అడిగారు.  కాంగ్రెస్ వ్యాఖ్యలు మేకపోతు గాంభీర్యమని  హరీష్ రావు  విమర్శించారు. 


మళ్లీ తమ పాలనను  తీసుకువస్తామని కాంగ్రెస్ నేతలు  చేస్తున్న ప్రచారంపై  మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు.  విద్యుత్ కోత, నీటి సరఫరాలో  ఇబ్బందులు,  నిరుద్యోగ సమస్య,లు  కాంగ్రెస్ పాలనలో  ఉన్నాయన్నారు.   అదే  పాలననను తిరిగి  తీసుకువస్తామని  కాంగ్రెస్ నేతలు  చెబుతున్నారన్నార.   కాంగ్రెస్ పాలన కావాలో, బీఆర్ఎస్  పాలన కావాలో  తేల్చుకోవాలని  మంత్రి హరీష్ రావు  ప్రజలను  కోరారు. నల్గొండ  జిల్లా బీఆర్ఎస్ కు  కంచుకోటగా  మంత్రి  పేర్కొన్నార. జిల్లాలోని  12  అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ కైవసం  చేసుకుంటుందన్నారు. 

డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో లేని అభివృద్ధి  తెలంగాణలో  సాగుతుందన్నాచరిత్ర డబుల్ ఇంజిన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లో తినడానికి తిండి కూడా లేదని  ఆయన  విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios