తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాగా పనిచేసే వాళ్లకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు అని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బాగా పనిచేసే వాళ్లకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు అని స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లనున్నట్టుగా చెప్పారు. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ ప్రతినిధుల సభ కొనసాగుతుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం 250కు పైగా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు పలు అంశాలపై మార్గనిర్దేశం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేసుకోవాలని సూచించారు. జాగ్రత్తగా లేకుంటే తాను కూడా చేసేది ఏమి లేదని అన్నారు. ఎమ్మెల్యేలు బాగా పనిచేసుకుంటే వారికే టికెట్లు అని తెలిపారు. ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండకపోతే వారికే నష్టమని అన్నారు. ఇక, ఈ సందర్భంగా పలు తీర్మానాలపై చర్చించి, ఆమోదం తెలుపనున్నారు.
