ఈ నెల 29న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్: పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ

ఈ నెల  29వ తేదీన  బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేవం  నిర్వహించనున్నారు.  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై  ఈ సమావేశాల్లో  ఎంపీలకు దిశా నిర్ధేశం  చేయనున్నారు. 

BRS Parliamentary Party meeting on January 29 in Pragathi Bhavan

హైదరాబాద్: ఈ నెల  29వ తేదీన  బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం  ప్రగతి భవన్ లో  నిర్వహించనున్నారు కేసీఆర్ .  పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశాల్లో  పార్టీ ఎంపీలకు  కేసీఆర్ దిశా నిర్ధేశం  చేయనున్నారు.

ఈ  నెల  31  నుండి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు  ప్రారంభం కానున్నాయి.  బడ్జెట్ కేటాయింపుల్లో  రాష్ట్రానికి  కేంద్రం నుండి  సరైన  కేటాయింపులు లేవని  కొంత కాలంగా  బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రాష్ట్రం నుండి పెద్ద ఎత్తున పన్నుల రూపంలో  కేంద్రానికి  చేరుతున్నాయని  రాష్ట్ర ప్రభుత్వం  చెబుతుంది. 

 కానీ  కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన  నిధుల విషయంలో  మీన మేషాలు  లెక్కిస్తుందని బీఆర్ఎస్  నేతలు  విమర్శిస్తున్నారు.  కేంద్రం నుండి రాష్ట్రానికి   పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం  మాత్రం  నిధులు రాలేదని  చెబుతుందని బీజేపీ  నేతలు  విమర్శలు చేస్తున్నారు. 

కేంద్రం నుండి  రాష్ట్రానికి  ఇచ్చిన నిధుల విషయంలో  చర్చకు తాము సిద్దమని  బీజేపీ నేతలు  సవాల్ విసురుతున్నారు.  ఈ సవాళ్లకు  బీఆర్ఎస్ నేతలు  కూడా ధీటుగా బదులిస్తున్నారు.  తాము కూడా  చర్చకు సిద్దంగా  ఉన్నామని  చెబుతున్నారు.  ఈ విషయమై  రెండు పార్టీల నేతల మధ్య  మాటల యుద్ధం  సాగుతుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios