వరదలు, సహాయక చర్యలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు. 722 గ్రామాల్లో పరిస్థితులను పునరుద్ధరించామని.. కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోందని ఆయన చెప్పారు.
వరదలు, సహాయక చర్యలపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు కౌంటరిచ్చారు బీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు. మంగళవారం సహచర ఎంపీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరదలపై ప్రభుత్వం వెంటనే స్పందించిందన్నారు. బాధతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శిబిరాలను ఏర్పాటు చేసిందని.. వరద సాయం కింద తక్షణం రూ.500 కోట్లు ఇచ్చిందని తెలిపారు.
తెలంగాణలో ఈసారి అత్యధిక శాతం వర్షపాతం నమోదైందని.. వరద ప్రాంతాల్లో సాయం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని కేశవరావు పేర్కొన్నారు. వారం రోజుల్లో పరిస్థితి చక్కబడుతుందని.. వర్షాలు, వరదలతో 500కు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని కేశవరావు తెలిపారు. 722 గ్రామాల్లో పరిస్థితులను పునరుద్ధరించామని.. కేంద్ర బృందం తెలంగాణలో పర్యటిస్తోందని, వరద నష్టాన్ని అంచనా వేస్తోందని ఆయన చెప్పారు.
