కాళేశ్వరం నిధులపై వ్యాఖ్యలు:బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్

బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే పై  బీఆర్ఎస్  ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై  లోక్‌సభను తప్పుదోవ పట్టించారని  నామా పేర్కొన్నారు

BRS moves privilege motion against BJP MP Nishikant Dubey for misleading Lok Sabha on Kaleshwaram project lns

న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబేపై  బీఆర్ఎస్  గురువారంనాడు ప్రివిలేజ్ నోటీసు  ఇచ్చింది.కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి లోక్‌సభను ఉద్దేశ్యపూర్వకంగా  తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఆరోపించింది. లోక్‌సభలో  రూల్  222  కింద  బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు  ప్రివిలేజ్ నోటీసు ఇచ్చారు. ఇవాళ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు  నోటీసును అందించినట్టుగా  నామా నాగేశ్వరరావు  చెప్పారు.

నరేంద్ర మోడీ సర్కార్ పై  ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో పాల్గొన్న సమయంలో బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు  కేంద్రం రూ. 86 వేల కోట్లను  కేటాయించిందని  దూబే పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం  2014 ను అమలు చేయకుండా  తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని బీఆర్ఎస్  ఎంపీ నామా నాగేశ్వరరావు  నిన్న  అవిశ్వాసంపై  చర్చ సందర్భంగా  ప్రస్తావించారు.ఈ సమయంలో  బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే జోక్యం చేసుకొని కాలేశ్వరం ప్రాజెక్టుకు  కేంద్రం ూ. 86 వేల కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు.

సభను తప్పుదోవ పట్టించేలా దూబే వ్యాఖ్యలు చేశారని నామా నాగేశ్వరరావు ఆరోపించారు.ఈ విషయమై దూబేపై  ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చినట్టుగా బీఆర్ఎస్ ఎంపీలు తెలిపారు.నిశికాంత్ దూబే వ్యాఖ్యలు  పూర్తిగా అవాస్తవమని  ఆ నోటీసులో నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు.  ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేశారని నామా నాగేశ్వరరావు చెప్పారు. ఇవాళ స్పీకర్ ఓం బిర్లాను  కలిసి బీఆర్ఎస్ ఎంపీలు ఈ నోటీసు ఇచ్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios